పట్టాంపూచ్చి చిత్రం తెరపైకి రానుంది. దర్శకుడు సుందర్.సీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటుడు జయ్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటి హనీరోస్ నాయకిగానూ, ఇమాన్ అన్నాచ్చి, బేబీ మానస్వీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భూ సుందర్.సీ నిర్మించారు. కథ, దర్శకత్వం బద్రీ నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 1980 ప్రాంతంలో జరిగే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. సుందర్.సీ పోలీస్ అధికారిగానూ, జయ్ సైకో గానూ నటించారని తెలిపారు.
టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో నేరస్తులను పట్టుకోవడం అంత సులభం కాదని, అలాంటిది వరుస హత్యలు చేసే సైకోను ఓ పోలీస్ అధికారి పట్టుకుని చట్టానికి అప్పగించారా..? లేదా..? అన్న ఇతి వృత్తంతో తెరకెక్కించిన చిత్రం పట్టాంపూచ్చి అని తెలిపారు. సైకోను పట్టుకోవడానికి ఫైట్స్ లాంటివి ఉండవని, ఇది మైండ్ గేమ్‌తో సాగే చిత్రంగా ఉంటుందని సుందర్.సీ తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి బయట పడటానికే ఇందులో సైకోగా నటించడానికి అంగీకరించినట్లు జయ్ తెలిపారు. 80 ప్రాంతంలో జరిగే కథ కావడంతో చిత్రానికి సీసీ వర్క్‌ను ఎక్కువగా వాడినట్లు చెప్పారు. దీనికి నవనీత్ సుందర్ సంగీతాన్ని, కృష్ణసామి ఛాయాగ్రహణను అందించారు.
చదవండి: రియాలిటీ షోలో బుల్లితెర నటికి గాయాలు
అప్పటినుంచి సర్కారువారి పాట ఉచితంగా చూడొచ్చు
Comments
Please login to add a commentAdd a comment