సుందర్ సీ దర్శకుడిగా, నటుడిగా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన కాఫీ విత్ కాదల్ చిత్రం యూత్‌ను బాగానే ఆలరించింది. ఇప్పుడు ఓ హార్రర్ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు రెడీ అయ్యారు. గతంలో ఆయన దర్శకత్వం వహించి ముఖ్య పాత్ర పోషించిన అరణ్మణై పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాలు మంచి విజయాన్ని పొందడంతో తాజాగా వాటికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా హార్రర్ జానర్‌లో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.
చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
కాగా ఇందులో విజయ్ సేతుపతి, సంతానం కథానాయకులుగా నటించనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన తెలుగు, తమిళం, హిందీ, భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో కాల్ షీట్స్ సమస్య తలెత్తడంతో అరణ్మణై 4 చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో ఆయన పాత్రలో సుందర్.సీనే నటించడానికి సిద్ధమవుతున్నారట. అవ్నీ సినిమా పతాకంపై నటి కుష్బూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment