
నయనతార, ఆర్‌జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’). ఆర్‌జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముకుత్తి అమ్మన్ 2’ రానుందని, ఇందులోనూ నయనతార లీడ్ రోల్‌లో నటిస్తారని, ఈ ఏడాది జూలైలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ ప్రకటించింది. కానీ ఆ సమయంలో దర్శకుడి పేరును వెల్లడించలేదు.
తాజాగా ‘ముకుత్తి అమ్మన్ 2’ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రంలో సుందర్. సి ఓ పాత్ర చేసే చాన్స్ కూడా ఉందట. కాగా ‘ముకుత్తి అమ్మన్ 2’కు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తారని, త్రిష లీడ్ రోల్‌లో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే తొలి భాగంలో లీడ్ రోల్‌లో నటించిన నయనతారనే మలి భాగంలోనూ లీడ్ రోల్ చేయనున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆర్‌జే బాలాజీ స్థానంలో దర్శకుడిగా మాత్రం సుందర్. సి వచ్చారు. ఇలా ‘ముకుత్తి అమ్మన్ 2’ డైరెక్టర్ మారారు. త్వరలోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment