Mathagam Web Series Streaming On Disney Plus Hotstar - Sakshi
Sakshi News home page

వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్‌ హీరో

Published Sat, Aug 19 2023 3:17 PM | Last Updated on Sat, Aug 19 2023 3:30 PM

Mathagam Web Series Streaming On Disney Plus Hotstar - Sakshi

తమిళసినిమా: నటుడు అధర్వ కథానాయకుడిగా నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ మత్తగం. దర్శకుడు గౌతమ్‌ మీనన్, నటుడు మణికంఠన్, నటి నిఖిలా విమల్, డీడీ, ఇళవరసు, అరువి తిరునావుక్కరసు, మూనార్‌ రమేశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి ప్రసాద్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించారు. ఎడ్విన్‌ సాకే ఛాయాగ్రహణంను, దర్శకుడు శివ సంగీతాన్ని అందించారు. ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు అధర్వ మాట్లాడుతూ మత్తగమ్‌ వెబ్‌ సిరీస్‌ ను 2018లోనే ప్రారంభించినట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్‌ మీననే ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రసాద్‌ మురుగేశన్‌ను పరిచయం చేశారని తెలిపారు. ప్రసాద్‌ మురుగేశన్‌ ఈ కథను క్వీన్‌ చిత్రానికి ముందే సిద్ధం చేశారని చెప్పారు. కథ సూపర్‌గా వచ్చిందని, దీన్ని దర్శకుడు తాను అనుకున్న విధంగా తెరకెక్కించారన్నారు.

షూటింగ్‌ పూర్తిగా రాత్రి వేళలోనే నిర్వహించినట్లు చెప్పారు. దీనికి ముందుగా బైబిల్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, ఆ తర్వాత పలు మార్పులు చేర్పులు చేయడంతో ఇది ఎలా వస్తుందో అన్న సందేహం ఉండేదన్నారు. దర్శకుడు శ్రమనే తమకు పోరాటం ఇచ్చిందన్నారు. ఇప్పుడు దీన్ని స్ట్రీమింగ్‌ చేస్తున్న డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అధర్వ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement