
చెన్నై సినిమా: ఇండియాలో అడ్రస్ లేని గ్రామా లు ఎన్నో ఉన్నాయని దర్శకుడు రాజమోహన్ పేర్కొన్నారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'అడ్రస్'. కాక్‌టైల్ సినిమా పతాకంపై నిర్మాత తమిళ్‌మణి వారసుడు అజయ్‌కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు అధ్వర్య మురళి ముఖ్య పాత్ర పోషించారు. ఇసక్కీ భారత్, దియా జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమ వుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం (ఏప్రిల్ 20) రాత్రి చెన్నైలో నిర్వహించా రు.
చదవండి: మోసపోయిన ముగ్గురు మహిళల కథే 'ర్యాట్'
నిర్మాత కె.రాజన్ నటుడు ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సమస్య అనేది ప్రతి మనిషికి, ప్రతి ఊరికి ఉంటుందన్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, వార్డు కౌన్సిలర్ల దాకా.. తిరునెల్వేలి వరకు ఉన్న గ్రామాల గురించి తెలుసన్నారు. ఆ తరువాత ఉన్న గ్రామాల గురించి ఎవరికీ తెలియదన్నారు. అలాంటి ఒక గ్రామ ప్రజల ఈతి బాధలను ఆవిష్కరించే చిత్రమే 'అడ్రస్' అని తెలిపారు.
చదవండి: హీరోతో బిగ్‌బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్
Comments
Please login to add a commentAdd a comment