
ఎప్పుడూ ఒకళ్లు తీస్తే ఫొటోలు దిగడమేనా? నేనూ తీస్తా అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు హన్సిక. మెడలో కెమెరా వేసుకున్నారు. క్లిక్‌మనిపించారు. ప్చ్.. ఫొటో బాగా రాలేదు. మరోసారి ట్రై చేశారు. ఈసారి ఫ్రేమ్ అదిరింది. ఫొటో పసందుగా వచ్చింది. ఇంతకీ హీరోయిన్ హాన్సిక ఫొటో తీసింది ఎవర్ని అంటే... హీరో అధర్వని. అతను మాత్రం ఎందుకు కామ్‌గా ఉంటాడు. నాలోనూ ఓ ఫొటోగ్రాఫర్ ఉన్నాడంటూ కెమెరాతో హన్సికను క్లిక్‌మనిపించారు. ఫొటోగ్రఫీ తర్వాత హన్సిక హెయిర్ స్టైలిస్ట్‌గా మారారు.
షూటింగ్ లొకేషన్లో తనతో పాటు ఉన్న అమ్మాయికి జడ వేశారు. స్టైల్‌గా ఉన్న ఆ జడ చూసి, ‘మీలో మంచి హెయిర్ స్టైలిస్ట్ ఉంది’ అని యూనిట్ సభ్యులు కితాబులిస్తే కిలకిలా నవ్వారు హన్సిక. అసలు షూటింగ్ స్పాట్‌లో యాక్షన్ చేయకుండా ఫొటోగ్రాఫర్, హెయిర్ స్టైలిస్ట్‌ల అవతరాలెత్తడం ఏంటి? ప్రొడ్యూసర్ డబ్బుని లెక్క చేయడంలేదు అనుకుంటున్నారా? ఈ సందడంతా షాట్ గ్యాప్‌లోనే. అధర్వ, హన్సిక జంటగా సామ్ ఆంటోని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ షూటింగ్ స్పాట్‌లోనే హన్సిక సరదాగా కెమెరామేన్, హెయిర్‌స్టైలిస్ట్ అవతారమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment