
హన్సిక, అథర్వ మురళి జంటగా ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. సామ్ ఆంటనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరా సినిమాస్ నిర్మిస్తోంది. ఇదొక యాక్షన్ థ్రిలర్. ‘విక్రమ్ వేదా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రానికి సంగీతం అందించిన సామ్ సి.యస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్‌గా ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. ఇదిలా ఉంటే.. హన్సిక, అథర్వ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని కోలివుడ్ కోడై కూస్తోంది. ఇద్దరూ ఆ వార్తలను ఖండించలేదు. మౌనం సమ్మతం అంటారా? ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే కానీ ఈ వార్తకు ఫుల్‌స్టాప్ పడదు.
Comments
Please login to add a commentAdd a comment