శరత్‌కుమార్‌పై ఫిర్యాదు
చెన్నై : శరత్‌కుమార్‌పై నడిగర్ సంఘం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శరత్‌కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో సంఘం ట్రస్ట్‌లో భారీ అవినీతి జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.గురువారం ఉదయం సంఘ నిర్వాహకులు పూచ్చి మురుగన్ నేతృత్వంలో న్యాయవాది కృష్ణతో కలిసి నగరంలోని పోలీస్‌కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.