ఇదేమి మాయ | idrimi movie audio released | Sakshi
Sakshi News home page

ఇదేమి మాయ

Published Wed, Apr 8 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

ఇదేమి మాయ

ఇదేమి మాయ

జగమే మాయ అంటారు. అందులో సినిమా ఇంకా మాయ. అలాంటి మాయా ప్రపంచంలో ఇదు ఎన్న మాయం (ఇదేమి మాయ) చిత్రం రూపొందుతోంది. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, లిస్టన్ స్టీఫెన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని హైయత్ హోటల్లో జరిగింది. చిత్ర దర్శక, నిర్మాతలు ఏ మాయ చేశారో గానీ చిత్ర పరిశ్రమ తరలి వచ్చిందా అనిపించింది.
 
  అక్కడ సినీ ప్రముఖులను చూస్తే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఆర్ కె సెల్వమణి, వసంత్, కె ఎస్ రవికుమార్, ప్రియదర్శన్, రామ్‌కుమార్, ప్రభు, ఎ ఎల్ అళగప్పన్, జి.వి.ప్రకాష్ కుమార్, సైదైరవి, మేనకా సురేష్, సుహాసిని, అమలాపాల్, మీనా, నవదీప్, నాజర్, టి.శి, పెప్సీ శివ, పి ఎల్ తేనప్పన్, కదిరేశన్, అరుళ్‌మణి ఇలా పలువురు చిత్ర ప్రముఖులు హాజరై ఇదు ఎన్న మాయం చిత్ర పాటలు, చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
 
 కుంకీ చిత్రంతో విజయ పరంపరను కొనసాగిస్తున్న విక్రమ్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా నటి మీనన్ సురేష్ వారసురాలు కీర్తి సురేష్ హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు విజయ్ వెల్లడించారు. ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ చిత్ర ఆడియోను దర్శకుడు విజయ్ గురువు ప్రియ దర్శన్ ఆవిష్కరించగా నటుడు ప్రభు తొలి ప్రతిని అందుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement