Radhika saratkumar
-
నటుడు శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు.. పీఆర్ టీం క్లారిటీ
ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్‌తో శరత్‌కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్‌మీడియాలోనూ శరత్‌కుమార్ ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్‌కుమార్ పీఆర్ టీం స్పందించింది. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం తెలిపింది. కాగా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శరత్‌కుమార్‌కు ప్రస్తుతం వారీసు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌కు తీవ్ర అస్వస్ధత
ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా 1986లో 'సమాజంలో స్త్రీ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శరత్‌కుమార్ సపోర్టింగ్ రోల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే హీరోగా మారాడు. తెలుగునాట మంచి పాపులారిటీ దక్కించుకున్న శరత్‌కుమార్ ఇటీవలె తెలుగులో పరంపర వెబ్‌సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. -
అదో అందమైన అనుభవం!
ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడం ఒక కళ. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి సుందరమైన ప్రదేశాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేశంలోని కొన్ని మనసు పులకించే అందమైన ప్రాంతాలను నటి రాధికాశరత్‌కుమార్ ఇటీవల సందర్శంచి మైమరచారు.తను ప్రధాన పాత్ర పోషిస్తున్న వాణిరాణి మెగా సీరియల్ చిత్రీకరణ కోసం యూనిట్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు.అక్కడ వాణిరాణి సీరియల్ కోసం 10 ఎపిసోడ్ సను చిత్రీకరిస్తున్నారట.అందులో భాగంగా ఆస్ట్రేలియాలో తను విహారయాత్ర అనుభూతుల్ని కింది విధంగా రాధికాశరత్‌కుమార్ పంచుకున్నారు. ప్రకృతిలోని అందాలను ఆస్వాదించడం నాకు చాలా ఫ్యాషన్ . అదే విధంగా అటవీజంతువులన్నా చాలా ఆసక్తి. అలాంటి అరుదైన ప్రకృతి సౌందర్యాలను తిలకించే అవకాశం ఇప్పుడు లభించింది. ఆస్ట్రేలియా దేశాన్ని అందాలకు నిలయంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా విక్టోరియా సమీపంలోని మెల్బోర్న్, ఫిలిప్ ఐల్యాండ్, పెన్ గున్ ప్యారడే, సముద్ర తీరం వంటి పలు ప్రాంతాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. ఆ దేశ జాతి జంతువు కంగారు,పెగ్విన్ లు చూడముచ్చటగా ఉంటాయి. ఫిలిప్ ఐల్యాండ్‌లో 90 నిమిషాల హైస్పీడ్ బోట్ రైడింగ్ చాలా థ్రిల్లింగ్ అనుభవం. ఆ సముద్ర తీరం ప్రాంతంలో అందమైన భవనాలతో కూడిన విశాలమైన వీధుల వీక్షణం మనసుకు ఉల్లాసాన్ని కలిగించింది.బల్లారత్ వైల్డ్ పార్క్‌ను సందర్శించకుంటే ఆస్ట్రేలియా పర్యటన సంతృప్తిని కలిగించదు. అదే విధంగా సావరింగ్ హిల్, అవుట్డోర్ మ్యూజియం లాంటివి సరికొత్త అనుభూతికి గురి చేస్తాయి. ముఖ్యంగా అవుట్డోర్ మ్యూజియంలో 1800 రకాల జంతుజీవరాసులను చూడవచ్చు. ఇక ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను ఒక్క సారైనా చూసి తీరాల్సిందే. అందులోని ఎంసీసీ లాంగ్‌రూమ్, ఎంసీసీ లైబ్రరీ, క్రికెట్ వ్యూవింగ్ రూమ్ వంటివి కనువిందు చేస్తాయి. ఆ గ్రౌండ్లో మన క్రిడాకారులు తమ ఉత్తమ ప్రతిభను చాటుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ బ్రాడ్‌మన్, సచిన్ వంటి క్రీడాకారులు తమ అద్భుతమైన ఆటతీరుతో మనల్ని అలరించారు. అదే విధంగా గ్రేట్ ఓషన్ రోడ్, కాలనియల్ ట్రమ్ కార్ రెస్టారెంట్ వంటి ప్రదేశాలు మనల్ని కొత్త లోకాలకు తీసుకెళతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రేలియా అందాలెన్నో.ఆ అందాలను ఆస్వాదించడానికి మరోసారి కుటుంబంతో కలిసి రావాలన్న కోరిక కలుగుతోంది. -
వారిని నేను వదలా!
వారిని నేను వదలా అంటున్నారు నటి రాధికా శరత్‌కుమార్. దక్షిణ భారత నటీనటుల సంఘం వివాదం రోజురోజుకు విశ్వరూపం దాల్చుతోందా? అంటే పరిశ్రమ వర్గాల నుంచి కాదనలేమనే సమాధానమే వ స్తోంది. నానాటికీ ఆరోపణలు, ఫిర్యాదులు అధికమవుతున్నారుు. సంఘ సర్వసభ్య సమావేశం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవిలకు సంఘం నుంచి శాశ్వత ఉద్వాసన పలికిన విషయం విదితమే. అరుుతే ఈ వ్యవహారంపై నటి రాధికాశరత్‌కుమార్ సంఘ నిర్వాహకులపై ఫైర్ అరుున సంగతి తెలిసిందే. ఇప్పటికే సంఘ కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలపై పలు ప్రశ్నలతో ధ్వజమెత్తారు. తాజాగా మరోసారి ఆరోపణలు గుప్పించారు. మీడియా భేటీలో రాధికాశరత్‌కుమార్ మాట్లాడుతూ ఒక సభ్యురాలిగా తన డబ్బులు సంఘంలో ఉన్నాయన్నారు. తన ప్రశ్నలకు సంఘ నిర్వాహకులు సమాధానాలు చెప్పితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. సంఘంలో వారసత్వ నిర్వాహకం అన్న సంస్కృతికి శివాజీగణేశనే శ్రీకారం చుట్టారని, ఆయన్ని వీరు ప్రశ్నంచగలరా అని ప్రశ్నించారు. తన భర్త శరత్‌కుమార్ సంఘంలో రూ 1.25 లక్షలు వదిలివచ్చారని, అలాంటిది వీరు అప్పు తీర్చామని చెప్పడంలో న్యాయం లేదన్నారు. క్రికెట్ క్రీడతో రూ.14 కోట్లు గడించారని, అందుకు ఆరు కోట్ల రూపాయలు నటీనటుల మేకప్‌కు ఖర్చు చూపించారన్నారు. అసలు క్రికెట్ ఆడేటప్పుడు ఏ నటుడు మేకప్ వేసుకుంటాడని ప్రశ్నించారు. వారు నడిగర్‌సంఘానికి భవనాన్ని కట్టవచ్చునని, అరుుతే విశాల్ పెళ్లి చేసుకుంటారని నమ్మలేమని అన్నారు. తన ప్రశ్నలకు బదులు చెప్పే తీరాలని, వారి పోకడ ఇలానే పోతే తాను వారిని వదలనని రాధికాశరత్‌కుమార్ హెచ్చరించారు. -
అలాంటివి బుద్ధిహీనులే చూస్తారు
కోలీవుడ్‌లో ఫైర్బాంబుగా పేర్కొనే తారల్లో నటి రాధికా శరత్‌కుమార్ ఒకరని చెప్పవచ్చు. తనకు అనిపించింది నిర్భయంగా వెల్లడించే మనస్తత్వం ఆమెది. ఇటీవల కొన్ని టీవీ చానళ్లల్లో ప్రచారం అవుతున్న కార్యక్రమాల గురించి నటి రాధికా శరత్‌కుమార్, ఆమెకు స్నేహితురాలు నటి శ్రీప్రియ ఎలా విమర్శలు గుప్పించారో చూద్దాం. కొన్ని తమిళం, తెలుగు, మలయాళం చానళ్లలో సంసార జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులకు చానళ్లలో పంచారుుతీ జరుపుతున్న కార్యక్రమాలు అధికం అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో నటి కుష్బు, తెలుగులో నటి రోజా, సుమలత, గీత, మలయాళంలో నటి ఊర్వశి లాంటి తారలు ఈ కార్యక్రమాల్లో పంచారుుతీతో మనస్పర్థలతోనో, ఇతర కారణాలతోనో సరిగ్గా కాపురం చేసుకోని దంపతులను కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టీవీ కార్యక్రమాలపై నటి శ్రీప్రియ విమర్శలను గుప్పించారు. వీల్లెవరు? భార్యాభర్తల మధ్య గొడవలను తీరుస్తామని చెప్పి నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన వారి జీవితాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. అభిమానులు సోషల్ మీడియాల్లో గగ్గోలు పెడుతున్నా సంబంధిత వ్యక్తుల గురించి చెప్పలేకపోతున్నామని, అలాంటిది సాధారణ వ్యక్తుల కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి వీళ్లెవరని ప్రశ్నించారు. నిజంగా అలాంటి వారి, కష్టాలు, సమస్యలపై అక్కర ఉంటే కెమెరా వెనుక కాకుండా ఏ న్యాయవాది వద్దకో, కౌన్సెలింగ్ ఇప్పించేవారి వద్దకో తీసుకెళ్లాలని నటి శ్రీప్రియ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చదువులేని అమాయకులే.. శ్రీప్రియ విమర్శలను సమర్థించిన నటి రాధికా శరత్‌కుమార్ చదువులేని అమాయకులే వారికి దొరుకుతారని, అదే విధంగా బుద్ధిహీనులే అలాంటి చానళ్లను చూస్తారని వ్యాఖ్యానించారు.అదే విధంగా నటి రంజిత ఈ కార్యక్రమాలపై స్పందిస్తూ ఇదంతా పెద్ద న్యూసెన్స అని వ్యాఖ్యానించారు. గుట్టుగా సాగించే సామాన్యుల సంసారాన్ని బయటకు లాగి వారి సమస్యలపై పంచారుుతీ చేసేది తారలా అంటూ విమర్శించారు. టీవీ చానళ్ల వారు కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్నారని అన్నారు. అలాంటి సమస్యలేమైనా ఉంటే సామాన్యులు అనుభవజ్ఞులైన ఎన్జీఓల సలహాలు తీసుకుని కోర్టుల ద్వారా కుటుంబాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. -
ఇదేమి మాయ
జగమే మాయ అంటారు. అందులో సినిమా ఇంకా మాయ. అలాంటి మాయా ప్రపంచంలో ఇదు ఎన్న మాయం (ఇదేమి మాయ) చిత్రం రూపొందుతోంది. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్, లిస్టన్ స్టీఫెన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలోని హైయత్ హోటల్లో జరిగింది. చిత్ర దర్శక, నిర్మాతలు ఏ మాయ చేశారో గానీ చిత్ర పరిశ్రమ తరలి వచ్చిందా అనిపించింది. అక్కడ సినీ ప్రముఖులను చూస్తే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఆర్ కె సెల్వమణి, వసంత్, కె ఎస్ రవికుమార్, ప్రియదర్శన్, రామ్‌కుమార్, ప్రభు, ఎ ఎల్ అళగప్పన్, జి.వి.ప్రకాష్ కుమార్, సైదైరవి, మేనకా సురేష్, సుహాసిని, అమలాపాల్, మీనా, నవదీప్, నాజర్, టి.శి, పెప్సీ శివ, పి ఎల్ తేనప్పన్, కదిరేశన్, అరుళ్మణి ఇలా పలువురు చిత్ర ప్రముఖులు హాజరై ఇదు ఎన్న మాయం చిత్ర పాటలు, చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కుంకీ చిత్రంతో విజయ పరంపరను కొనసాగిస్తున్న విక్రమ్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా నటి మీనన్ సురేష్ వారసురాలు కీర్తి సురేష్ హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు విజయ్ వెల్లడించారు. ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్ర ఆడియోను దర్శకుడు విజయ్ గురువు ప్రియ దర్శన్ ఆవిష్కరించగా నటుడు ప్రభు తొలి ప్రతిని అందుకున్నారు.