వారిని నేను వదలా! | radika to Vishal, treasurer kartilapai said many questions | Sakshi
Sakshi News home page

వారిని నేను వదలా!

Published Sun, Dec 4 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

వారిని నేను వదలా!

వారిని నేను వదలా!

వారిని నేను వదలా అంటున్నారు నటి రాధికా శరత్‌కుమార్. దక్షిణ భారత నటీనటుల సంఘం వివాదం రోజురోజుకు విశ్వరూపం దాల్చుతోందా? అంటే పరిశ్రమ వర్గాల నుంచి కాదనలేమనే సమాధానమే వ స్తోంది. నానాటికీ ఆరోపణలు, ఫిర్యాదులు అధికమవుతున్నారుు. సంఘ సర్వసభ్య సమావేశం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవిలకు సంఘం నుంచి శాశ్వత ఉద్వాసన పలికిన విషయం విదితమే. అరుుతే ఈ వ్యవహారంపై నటి రాధికాశరత్‌కుమార్ సంఘ నిర్వాహకులపై ఫైర్ అరుున సంగతి తెలిసిందే.

ఇప్పటికే సంఘ కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలపై పలు ప్రశ్నలతో ధ్వజమెత్తారు. తాజాగా మరోసారి ఆరోపణలు గుప్పించారు. మీడియా భేటీలో రాధికాశరత్‌కుమార్ మాట్లాడుతూ ఒక సభ్యురాలిగా తన డబ్బులు సంఘంలో ఉన్నాయన్నారు. తన ప్రశ్నలకు సంఘ నిర్వాహకులు సమాధానాలు చెప్పితీరాల్సిందేనని డిమాండ్ చేశారు. సంఘంలో వారసత్వ నిర్వాహకం అన్న సంస్కృతికి శివాజీగణేశనే శ్రీకారం చుట్టారని, ఆయన్ని వీరు ప్రశ్నంచగలరా అని ప్రశ్నించారు. తన భర్త శరత్‌కుమార్ సంఘంలో రూ 1.25 లక్షలు వదిలివచ్చారని, అలాంటిది వీరు అప్పు తీర్చామని చెప్పడంలో న్యాయం లేదన్నారు.

క్రికెట్ క్రీడతో రూ.14 కోట్లు గడించారని, అందుకు ఆరు కోట్ల రూపాయలు నటీనటుల మేకప్‌కు ఖర్చు చూపించారన్నారు. అసలు క్రికెట్ ఆడేటప్పుడు ఏ నటుడు మేకప్ వేసుకుంటాడని ప్రశ్నించారు. వారు నడిగర్‌సంఘానికి భవనాన్ని కట్టవచ్చునని, అరుుతే విశాల్ పెళ్లి చేసుకుంటారని నమ్మలేమని అన్నారు. తన ప్రశ్నలకు బదులు చెప్పే తీరాలని, వారి పోకడ ఇలానే పోతే తాను వారిని వదలనని రాధికాశరత్‌కుమార్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement