
నటుడు శరత్ కుమార్ తన కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. వీరిని తలైవా సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని నటుడు శరత్ కుమార్ తన ట్విట్టర్‌లో పొందుపరిచారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటుడు శరత్ కుమార్ పెరియ పళవేట్టరైయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్రం చూసిన రజనీకాంత్ శరత్ కుమార్‌కు ఫోన్‌చేసి ప్రశంసించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను రజనీకాంత్ కలిసినట్లు శరత్ కుమార్ పేర్కొన్నారు. కూతురు వరలక్ష్మి కూడా రావడంతో తాజాగా నటిస్తున్న చిత్రాలపై కొద్దిసేపు చర్చించినట్లు వెల్లడించారు.