
నచ్చితే ఉచితంగా...
కథా పాత్ర తన మనస్సును హత్తుకుంటే ఉచితంగా నటించడానికి సిద్ధం అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది నటి ఓవియూ. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళకుట్టి ఈ బ్యూటీ. తొలి చిత్రంతోనే విజయూన్ని నమోదు చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత తడబడి, తప్పటడుగులు వేసింది. అయితే ఇటీవల మళ్లీ గాడిలో పడిన ఓవియూ కలగలప్పు, మేరినా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో చేసింది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి.
పస్తుత హీరోయిన్లు హీరోలతో పోటీపడి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ మలయాళ భామ పాత్ర న చ్చితే పారితోషికం తీసుకోకుండా నటిస్తాననడం విశేషం. ప్రస్తుతం అందాలు ఆరబోయడానికి రెడీ అయిన ఓవియూ సాధ్యమైనంత వరకు వైవిధ్య భరిత చిత్రాలు చేయూలని ఆశిస్తున్నానంది. ధనార్జన మాత్రమే తన ధ్యేయం కాదని, పాత్ర తన మనస్సును టచ్ చేస్తే పారితోషికం తీసుకోకుండా నటించడానికి సిద్ధం అని చెప్పింది.
మేకప్ సహాయకులకు నిర్మాత వేతనాలు చెల్లిస్తే చాలని పేర్కొంది. ప్రస్తుతం శరత్‌కుమార్ సరసన సండమారుతంతోపాటు భారతీరాజ దర్శకత్వంలో ఒక చిత్రం, మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్టు తెలిపింది. ఉచితంగా నటించడానికి నిజంగా సిద్ధమా అన్న ప్రశ్నకు పాత్ర ఆకట్టుకుంటే సిద్ధమేనని స్పష్టం చేసింది. సాధారణ పాత్రలకు తన స్థాయికి తగ్గ పారితోషికం తీసుకుంటానని ఓవియూ అంది.