శరత్‌కుమార్‌తో మీరానందన్ | meera nandan acts with sarath kumar | Sakshi
Sakshi News home page

శరత్‌కుమార్‌తో మీరానందన్

Published Thu, Jul 10 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

శరత్‌కుమార్‌తో మీరానందన్

శరత్‌కుమార్‌తో మీరానందన్

వాల్మీకి ఫేమ్ మీరానందన్ గుర్తుందా? మలయాళంలో మోహన్‌లాల్ వంటి స్టార్ హీరో సరసన నటించి ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి కోలీవుడ్ కంట పడ్డారు. ఇంకేముంది వాల్మీకి చిత్రంలో హీరోయిన్ అయిపోయారు. ఆ తరువాత అయ్యనార్, కాదలుక్కు మరణమిల్లై, సూర్య నగరం వంటి చిత్రాలలో నటించినా సరైన హిట్స్ లేకపోవడంతో ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. టాలీవుడ్ బై భోలో తెలంగాణ చిత్రంలో మెరిశారు.

అలాంటి మీరానందన్ తాజాగా కోలీవుడ్‌కు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. శరత్‌కుమార్ హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న చండమారుదం చిత్రంలో నటిస్తున్నారు. మ్యూజిక్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ఓవియ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శరత్‌కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు సంభాషణలు రాయడం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement