
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై నటుడు శరత్ కుమార్ విరుచుకుపడ్డారు. సినిమాల విడుదల సమయంలో పబ్లిసిటీ కోసం రజనీ రాజకీయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని అన్న ఆయన.. రజనీ చెబుతున్న ఆధ్యాత్మికత, సెక్యులర్ విలువలేంటో ఎన్నికల సమయంలో తెలుస్తుందన్నారు.
అప్పుడే రజనీ వెనకున్న రాజకీయ శక్తులు కూడా బయటకు వస్తాయని చెప్పారు. తమిళులు, కన్నడిగుల మధ్య కావేరి, మేగదారు సమస్యలు వచ్చినప్పుడు రజనీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రజనీకి ధైర్యం ఉంటే కర్ణాటక నుంచి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగగలరా? అంటూ సవాల్ విసిరారు.
జయలలిత, కరుణానిధిలు రాజకీయాల్లో ఉన్నప్పుడు రజనీ ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నించారు. యువతరానికి రాజకీయాల్లో దారి ఇవ్వండన్న విశాల్.. ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం రజనీ చెవిలో చెబుతారా? అంటూ విమర్శించారు.