
మహేశ్ తండ్రిగా?
ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ యాక్టర్ లేదా సీనియర్ హీరో కనిపిస్తే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు.
ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ యాక్టర్ లేదా సీనియర్ హీరో కనిపిస్తే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. సినిమాపై మంచి క్రేజ్ వస్తుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారట! కాబట్టి హీరో తండ్రి పాత్రకూ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. ఆ పాత్రకు సరిపోయే నటుడు ఎవరా అని సర్చ్ చేసిన చిత్రబృందం తమిళ నటుడు శరత్‌కుమార్‌ను ఫైనల్ చేశారని టాక్. ఈ సినిమాకు ‘భరత్ అను నేను’ టైటిల్ ప్రచారంలో ఉంది. ‘బన్ని’ సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా పవర్‌ఫుల్ రోల్‌లో శరత్‌కుమార్ నటనను ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు. మహేశ్– కొరటాల చిత్రంలోనూ ఆయన పాత్ర అదే స్థాయిలోనే ఉంటుందని సమాచారం.