
సినిమా: టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నటుడు శరత్‌కుమార్‌కు ఇలాంటి ఒక అనుభవమే ఇటీవల ఎదురైంది. అయితే ఆయన రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నారు. అఖిల భారత సమత్తువ కట్చి పార్టీ నేత శరత్‌కుమార్ పేరును వాడుకుంటూ ఒక వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు.
ఈ విషయం శరత్‌కుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన యాక్షన్‌లోకి దిగారు. శరత్‌కుమార్ పోలీసులను ఆశ్రయించకుండా, తనే రంగంలోకి దిగి తన పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి గురించి ఆరా తీశారు. తన వాయిస్‌తో మోసానికి పాల్పడిన వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలిసింది. దీంతో నటుడు శరత్‌కుమార్ గురువారం చెన్నై పోలీస్‌కమిషనర్‌ను కలిసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment