ప్రభాస్‌కైతేనే ఐ లవ్యూ చెప్తా : హీరోయిన్‌ | Varalakshmi Sarathkumar Talks About Actor Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కైతేనే ఐ లవ్యూ చెప్తా : హీరోయిన్‌

Published Wed, Feb 20 2019 10:31 AM | Last Updated on Thu, Feb 21 2019 3:30 PM

Varalakshmi Sarathkumar Talks About Actor Prabhas - Sakshi

నేను ఐ లవ్‌ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఈ అమ్మడిని డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్‌ రోల్స్‌ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ భామ ఇంత పేరు తెచ్చుకునేది కాదేమో.

నాయకి, ప్రతినాయకి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఇలా ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకుని నటించేయడంతో ఇప్పుడు కోలీవుడ్‌లోనే బిజీయస్ట్‌ నటిగా మారింది. సండైకోళీ–2, సర్కార్‌ వంటి చిత్రాల్లో విలనిజంలో దుమ్మురేపిన వరలక్ష్మీశరత్‌కుమార్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు నటుడు విశాల్‌తో చెట్టాపట్టాల్‌ అంటూ ఈ మధ్య వరకూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇటీవల విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ కావడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది.

కాగా నటి వరలక్ష్మీ తాజాగా మరో సంచలనానికి తెర లేపింది. ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తెలుగు నటుడు ప్రభాస్‌ అంటే నాకు చాలా ఇష్టం అని, నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని అని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్‌లో ఉండడం వరలక్ష్మీకి అలవాటే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement