దక్షిణాది హీరోయిన్లలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ది మాత్రం డేరింగ్ అండ్ డైనమిక్ రూట్ అనే చెప్పాలి. అర్ధరాత్రి పోలీసునే చెంపలు వాయించిన రఫ్ బ్యూటీ ఈమె. ఈ విషయాన్ని ఆమె తండ్రి, నటుడు శరత్‌కుమార్‌నే స్వయంగా ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఇక నటిగా వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాది సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. పాత్ర ఏదైనా ఈమెకు మోల్డ్ అయిపోతారు.
పోడా పోడీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఆ తరువాత తనకు నచ్చినట్లు కాకుండా ప్రేక్షకులు మెచ్చేటట్లు నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో కథానాయకి పాత్రలను అటుంచితే ఛాలెంజింగ్‌తో కూడిన విలనిజం పాత్ర అయితే ఈ విలక్షణ నటిని వెతుక్కుంటూ రావాల్సిందే. ఆ మధ్య సర్కార్ చిత్రంలో అలాంటి పాత్రలోనే విజయ్‌ను ఢీకొన్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు పోటీ ఇచ్చారు.
ఈమెలో మొండి ధైర్యం కూడా ఉంది. నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సైకిల్ తొక్కడం లాంటి వాటి జోలికి పోలేదట. అయితే ఇప్పుడు ఏకంగా బుల్లెట్ ఎక్కేవారు. సైకిల్ నుంచి స్టెప్ బై స్టెప్ బుల్లెట్ నడపడం వరకు నేర్చేసుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది.
దీని గురించి ఆమె పేర్కొంటూ బాల్యంలో కొన్ని కారణాల వల్ల తనకు బైక్ తోలడానికి ఇంట్లో అనుమతి ఇవ్వలేదన్నారు. అయితే బైక్ నడపడానికి భయాన్ని పోగొట్టడానికి ఇది సరైన టైమ్ అని భావించానన్నారు. దీంతో గత వారం బైక్ నడపడానికి తొలి మెట్టు అయిన సైకిల్ తొక్కడం నేర్చుకున్నానని, ఆ తరువాత స్క్రూటీ, ఇప్పుడు బుల్లెట్ కూడా నడుపుతున్నానని చెప్పారు. మొదట్లో కొంచెం కష్టం, బాధ అనిపించినా, భయాన్ని పోగొట్టడానికి ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇక్కడ తాను కింద పడ్డాను అన్నది ముఖ్యం కాదని ఎలా లెగిశాను అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment