డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియా రివ్యూవర్స్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘కొండ్రల్ పావమ్’. తెలుగులో చిత్రం ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి ఆమె మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానల్‌తో ముచ్చటించిన ఆమె సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రివ్యూ చేప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండాలంది. ‘ఈ మధ్య ఇలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయో లేదో అలా సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది?
ఇంకా చెప్పాలంటే కొన్ని రిలీజ్ కాకముందే ట్రైలర్, టీజర్లు చూసి వాళ్లకు అనిపించింది చేప్పేస్తున్నారు. అలా అర్థంపర్థంలేని రివ్యూలు ఇస్తూ ప్రేక్షకుడిని తప్పుదొవ పట్టిస్తున్నారు. అసలు రివ్యూలు ఇవ్వడానికి వాళ్లు ఎవరు. మూవీ ఈ సినిమాలో ఇది బాగోలేదు, ఆ సినిమాలో అది బాగోలేదు, అసలు మూవీలో సందేహమే లేదంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా. అసలు మీరూ ఎలాంటి సినిమా ఆశిస్తున్నారు?’ అని ప్రశ్నించింది. అనంతరం ‘మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ అయిపోయింది. అసలు సినిమా హిట్టు లేదా ఫ్లాప్ అని చెప్పడానికి వాళ్లేవరు. అది ప్రేక్షకుల నిర్ణయం. మూవీ బాగుందా? లేదా అని చెప్పేది ఆడియన్స్ మాత్రమే. ప్రేక్షకులను సినిమా చూసి ఆనందించనివ్వండి. చెత్త రివ్యూలతో వాళ్లను తప్పుదొవ పట్టించకండి. ఇదొక్కటే నా విన్నపం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ.. అలాగే కొంతమంది సినిమా కలెక్షన్స్ గురించి వాగ్వాదాలకు దిగుతున్నారని, ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్ చేయండంటూ రివ్యూవర్స్‌కి ఆమె సూచించింది. దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతొంది. అంతేకాదు ఆమె మాట్లాడిని వీడియోను వరలక్ష్మి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment