
వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో కె. వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చేజింగ్’. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు. జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియాండి మాట్లాడుతూ– ‘‘చేజింగ్’ మా కాంబినేషన్‌లో మొదటి సినిమా అయినా ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. మరిన్ని తెలుగు, తమిళ సినిమాలు తీయాలనుకుంటున్నాం’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ గుండు ప్రభాకర్, కె. వీరకుమార్, దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడారు.