‘‘కెరీర్ తొలిరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కి నో చెప్పాను అని చాలా సందర్భాల్లో నన్ను సినిమాలనుంచి పలువురు దర్శక–నిర్మాతలు దూరం పెట్టారు. కానీ ఇవాళ 25 సినిమాలు పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాను’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారామె. ‘‘మహిళలు తమను లైంగికంగా వేధించేవాళ్లను, క్యాస్టింగ్ కౌచ్‌కి అంగీకరించమనే వాళ్ల పేర్లను ధైర్యంగా బయటపెట్టాలి. అవకాశాలు తగ్గిపోతాయనే భయంలో ఉండిపోకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్లి హీరోయిన్ అవుదామనుకున్నా అది వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఇష్టం వాళ్లది. కానీ ముందు అంగీకరించి ఆ తర్వాత ఫలనా వాళ్లు ఇలా చేశారు అని ఫిర్యాదు చేయకూడదు. కష్టమైనా ‘నో’ చెప్పడం నేర్చుకోండి’’ అన్నారు వరలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment