కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. అందులో విలనిజం ప్రదర్శించి మెప్పించిన పాత్రలు చాలానే ఉన్నాయి.
అలా వరలక్ష్మి నటిగా దశాబ్ద కాలాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ పదేళ్ల తన సినీ కెరీర్ అంత ఈజీగా సాగలేదంటూ ఆమె చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ పదేళ్లలో తాను 45 చిత్రాలు చేశానని చెప్పారు. ‘ఈ పదేళ్ల నా సినీ కెరీర్‌లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను.ముఖ్యంగా విలన్ పాత్రలో ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నిజం చెప్పాలంటే విలనిజాన్ని ప్రదర్శించడం చాలా కష్టం. అయినా అలాంటి పాత్రలో నటించగలనని నిరూపించాను.
అయితే ఈ పదేళ్ల నా సినీ ప్రయాణం అంతా జాలీగా సాగలేదు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డాను. మరెన్నో తిరస్కారాలకు గురయ్యాను. అయితే ఈవేవి నన్ను ఆపలేదు. వీటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కఠినంగా శ్రమించాను. ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు తిరిగి చూస్తే 45 చిత్రాలు చేశాననే తలుచుకుంటుంటే మంచి అనుభూతికి లోనవుతున్నా. నాలోని నటనను చాటుకునే విధంగా పలు అవకాశాలు వస్తున్నాయి. విరామం లేకుండా నటిస్తున్నాను. నా నట జీవితం చాలా బిజీగా సాగుతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తన పోస్ట్ పేర్కొన్నారు.
చదవండి:
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత, పరిస్థితి విషమం!
నాకు ఇష్టమైన నటుడితో నటించే అవకాశం వచ్చింది : హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment