శబరి: తల్లి ప్రేమను గుర్తుచేసే సాంగ్‌ రిలీజ్‌ | Sabari: Anaganaga Lyrical Song Out From Varalakshmi Sarathkumar Movie | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రేమను గుర్తు చేసే సాంగ్‌.. విన్నారా?

Published Sat, Apr 27 2024 2:09 PM | Last Updated on Sat, Apr 27 2024 3:35 PM

Sabari: Anaganaga Lyrical Song Out From Varalakshmi Sarathkumar Movie

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అనగనగా ఒక కథలా ఓ చందమామా.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ' పాటను ఆస్కార్ విన్నర్, గేయరచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ సతీమణి సుచిత్ర నృత్య రీతులు సమకూర్చారు. 

సాంగ్‌ చాలా ప్రత్యేకంగా..
పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... 'గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు'' అని చెప్పారు.

 

చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement