
లక్ష్మీమీనన్‌పై ధనుష్ కన్ను
కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీమీనన్. చాలా తక్కువ హీరోల సరసన నటించిన ఈ భామ త్వరలోనే అందరి హీరోల హీరోయిన్ అవబోతోంది. షూటింగ్‌లకు సమయపాలన పాటిస్తూ చిత్ర ప్రచార కార్యక్రమాలకు క్రమం తప్పకుండా పాల్గొంటూ దర్శక నిర్మాతల వద్ద మంచి హీరోయిన్‌గా పేరు కొట్టేస్తున్న లక్ష్మీమీనన్‌పై స్టార్ హీరోల కన్ను పడుతోంది. వరుస సక్సెస్‌లతో విజయపథంలో పయనిస్తున్న ఈ కేరళ కుట్టిని తనకు జంటగా ఎంపిక చేయడానికి నటుడు ధనుష్ తన చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశిస్తున్నట్లు సమాచారం.
తొలి చిత్రం కుంకీతో విక్రమ్ ప్రభు సరసన, మలి చిత్రం సుందర్‌పాండియన్ చిత్రంలో శశికుమార్‌కు జంటగా, మూడో చిత్రంలో ఒక మెట్టు ఎక్కి విశాల్‌తో జతకట్టిన లక్ష్మీమీనన్ తాజాగా గౌతమ్ కార్తీ సరసన సిపాయ్, విశాల్ సరసన మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా నటిగా మంచి పేరుతోపాటు పలు అవకాశాలు రావడంతో ఈ కేరళ కుట్టి సంతోషంతో తబ్బిబ్బైపోతోంది. అంతా బాగానే ఉంది గానీ ఈ లక్ష్మీ నానాటికీ బరువెక్కిపోతుండటంతో కాస్త ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని దర్శక, నిర్మాతలు సలహా లివ్వడంతో ప్రస్తుతం ఈ భామ బరువు తగ్గే పనిలో పడిందట.