
ధనుష్‌కు జోడీ కాదట
నటుడు కమలహాసన్ కుటుంబం నుంచి వస్తున్న మరో నటి అక్షర. ఈమె అక్క శ్రుతిహాసన్ లాగానే తన లక్‌ను తొలుత బాలీవుడ్‌లో పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రం లో హీరో కోలీవుడ్ నటుడు ధనుష్ కావడం విశేషం.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బాల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు అమితాబ్ కూడా నటించడం విశేషం. దర్శకుడు బాల్కి అక్షరను ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో చూశారట. ఆమె నడక హొయలు, హావభావాలు బాల్కిని ఎంతగానో ఆకట్టుకున్నాయట. వెంటనే తన చిత్రంలో నటిం చమని అడిగారట.
అప్పటి వరకు పలు అవకాశాలు (మణిరత్నంతో సహా) వచ్చినా నటించడానికి అంగీకరించక తాను తెరవెనుకనే ఉంటానని చెప్పుకొచ్చిన అక్షర బాల్కి అడగ్గానే ఓకే చెప్పేశారట. ఈ చిత్రంలో ఈ బ్యూటీ ధనుష్ సరసన నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించారు. దీని గురించి బాల్కి తెలుపుతూ అక్షర ధనుష్‌కు జోడీ కాదని పేర్కొన్నారు. ఆమె ఈ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఇంతకీ ధనుష్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు.