
ధనుష్‌కు జంటగా అక్షర?
జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌తో ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ రెండవ కూతురు అక్షర రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారని కోలీవుడ్‌లో ప్రచారం అవుతోంది.
జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌తో ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ రెండవ కూతురు అక్షర రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారని కోలీవుడ్‌లో ప్రచారం అవుతోంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో తెరకెక్కనుందని, దీనికి ప్రముఖ హిందీ దర్శకుడు బాల్కి తెరరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. బాల్కి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇంతకుముందు బిగ్‌బి అమితాబ్‌తో ‘పా’, ‘చీనీ కుమ్’ వంటి వైవిద్యభరిత చిత్రాలను రూ పొందించారు. మరోసారి అమితాబ్‌బచ్చన్‌తో ఒక చిత్రం, షారూఖ్‌ఖాన్‌తో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా రాంజానా చిత్రంతో బాలీవుడ్‌ను ఆకర్షించిన కోలీవుడ్ నటుడు ధనుష్‌పై బాల్కి దృష్టి పడినట్టు సమాచారం. ధనుష్ హీరోగా నటించే చిత్రంలో అక్షరను హీరోయిన్‌గా తెరంగేట్రం చేయిం చడానికి సిద్ధం అవుతున్నట్లు తెలి సింది. అక్షర కెమెరా వెనుక పని చేయాలని ఆశిస్తున్నారు. సొసైటీ అనే హిందీ చిత్రానికి దర్శకుడు రాహుల్ దూల్‌కై వద్ద సహాయ దర్శకురాలిగా పని చేశారు. బాల్కి చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం కావడానికి అక్షర ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.