'రాయన్‌'తో లాభాలు.. ధనుష్‌కు గిఫ్ట్‌గా రెండు చెక్కులు | Kalanithi Maran Send Gift To Dhanush For Raayan Movie | Sakshi
Sakshi News home page

'రాయన్‌'తో లాభాలు.. ధనుష్‌కు గిఫ్ట్‌గా రెండు చెక్కులు

Aug 23 2024 4:49 PM | Updated on Aug 23 2024 6:23 PM

Kalanithi Maran Send Gift To Dhanush For Raayan Movie

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్‍పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్‌ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ధనుష్‌ కెరియర్‌లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.

ధనుష్‌ హీరోగా, డైరెక్టర్‌గా తన ప్రతిభను రాయన్‌లో చూపించాడు. బాక్సాఫీస్‌ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.  ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది.  ధనుష్‌ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్‌కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.

ఓటీటీలో రాయన్‌
రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్‌.జే సూర్య వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీకి  ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు.  డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్‌ కూడా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement