ఓటీటీలో 'రాయన్‌'.. అధికారిక ప్రకటన వచ్చేసింది | Danush Raayan Movie OTT Release Date Locked, Check Streaming Platform Details Inside | Sakshi

Raayan OTT Release: ఓటీటీలో 'రాయన్‌'.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Aug 16 2024 12:27 PM | Updated on Aug 16 2024 1:17 PM

Danush Rayan Movie OTT Streaming Date Locked

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈమేరకు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ధనుష్‌ కెరియర్‌లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్‌గా కూడా ధనుష్‌ మెప్పించాడు. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో రాయన్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. అయితే, సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

రాయన్ సినిమా ఆగష్టు 23న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ ప్రకటించింది. తెలుగు,హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్‌ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్‌.జే సూర్య వంటి స్టార్స్‌ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్‍పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద  ఆ సంస్థ లాభాలను అందుకుంది.  

ఈ మూవీకి  ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు.  డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్‌ కూడా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement