
తమిళ హీరోల్లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటారు ధనుష్. ఎప్పటికప్పుడు సినిమాలను ప్రారంభిస్తూ, పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉంటారాయన. కరోనా కారణంగా సుమారు ఏడు నెలలు షూటింగ్స్‌కు దూరమయ్యారు ధనుష్. ఆయన చేతిలో దాదాపు నాలుగు సినిమాలున్నాయి. తాజాగా మళ్లీ షూటింగ్ లొకేషన్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్రంగీ’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు ధనుష్. కెమెరాతో దిగిన ఫోటోను పంచుకొని, ‘నా ప్రేయసి (కెమెరాని ఉద్దేశించి) దగ్గరకు తిరిగొచ్చేశాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment