ధనుష్ హీరోగా వెంకీ అల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్’. సోమవారం ఈ సినిమాలో హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ నారాయణ, పారిశ్రామికవేత్త సూరేశ్ చుక్కపల్లి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఎస్ రాధాకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించాడు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జనవరి 5న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభం కానుందని ఈ సందర్భంగా మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ పాత్ర కనిపించనుండగా.. సాయి కుమార్, తనికెళ భరణి, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment