
ధనుష్‌పై ఆరోపణలు చేస్తూ నటి నయనతార ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, కోలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్లు కూడా నయన్‌కు మద్ధతు తెలిపారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా నేనూ రౌడీనే అనే చిత్రం తీసిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలైంది.
నయనతార జీవిత చరిత్ర డాక్యుమెంటరీలో ధనుష్ అనుమతి లేకుండా నేనూ రౌడీనే సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నారు. దీంతో కాపీ రైట్స్ చట్టం కింది తనకు రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపారు. దీంతో నయన్ ఫైర్ అవుతూ ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేసింది. చాలాకాలంగా తమపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపిస్తున్నావ్ అంటూ ధనుష్‌పై మండిపడింది. "నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది.' అంటూ ఫైర్ అయింది.

నయనతారకు మద్ధతుగా స్టార్స్
నయనతార చేసిన ఆరోపణలకు చాలామంది స్టార్స్ మద్ధతు ఇస్తున్నారు. ఆమె షేర్ చేసిన పోస్ట్‌కు శ్రుతిహాసన్, నజ్రియా, ఏక్తాకపూర్, ఐశ్వర్య లక్ష్మి, దియా మీర్జా, శిల్పారావు లైక్ కొట్టి తమ సపోర్ట్ తెలిపారు. తంగలాన్ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన మలయాళ నటి పార్వతీ తిరువొత్తు కూడా నయన్‌కు సపోర్ట్ చేసింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ.. నయన్ ధైర్యాన్ని మెచ్చుకుంది.
స్మృతి కిరణ్ అనే దర్శకురాలు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయింది. ఈ సంఘటన చాలా బాధాకరం అంటూనే నయన్‌ను అభినందించింది. ఇలాంటి విషయాలు బయటపెట్టినప్పుడు పలు ఇబ్బందులు రావచ్చని కూడా సూచించింది. అయితే, ధనుష్‌కు భారీగా ఆయన ఫ్యాన్స్ మద్ధతు తెలుపుతున్నారు. వివాదాలు ఉంటే ఇలా ఒక అగ్ర హీరో గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారంటూ నయన్‌పై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment