నటుడు ధనుష్‌కు కోర్టు సమన్లు | hero danush recieves court summons | Sakshi
Sakshi News home page

నటుడు ధనుష్‌కు కోర్టు సమన్లు

Published Sat, Jun 27 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

hero danush recieves court summons

చెన్నై : నటుడు ధనుష్‌కు చెన్నై ఎగ్మూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.వివరాల్లోకెళితే నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ సూడిమోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రంలో న్యాయవాదులను కించపరచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ అఖలభారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్  ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు శుక్రవారం మెజిస్ట్రేట్ మురుగన్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తర పున న్యాయవాది నమోనారాయణ హాజరయ్యి తన వాదనలను వినిపించి భారతశిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆయన వాదనలను విన్న న్యాయమూర్తి నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement