reuninion
-
స్కూల్ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్‌కు టాలీవుడ్ లోను భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తాజాగ తన స్కూల్ స్నేహితులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) ధనుష్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకరకంగా సినిమాపై ఉండే పిచ్చి అభిమానమే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ఆయన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న ధనుష్ మళ్లీ తన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇలా కలిశాడు. ఎప్పుడో విడిపోయిన వారందరూ మళ్లీ ఇలా ఒక్కసారి రీయూనియన్ అయ్యారు. ధనుష్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు కదా తమతో కలుస్తాడా..? తమతో కలిసి భోజనం చేస్తాడా..? కనీసం ఫోటో అయినా దిగుతాడా..? అనే సందేహాలు వారిలో వచ్చాయట. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా గత మూలాలు ఎలా మరిచిపోతామని ధనుష్ పేర్కొన్నాడట. వారితో ఒకరోజంతా గడపడమే కాకుండు పలు పాటలకు డ్యాన్స్‌లు చేయడమే కాకుండా అందరూ కలిసి భోజనం చేయడం. ఇలా ఆనందంగా గడిపారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం గడిపింది మీతోనే కదా అని ఆయన తెలపడంతో వారంతా ఎంతో సంతోషంగా ధనుష్‌తో ఫోటోలు దిగారట. ప్రస్తుతం ధనుష్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను స్కూల్ డేస్ నుంచి ఉన్న కొందరు స్నేహితులే చూసుకుంటున్నారు. గతంలో స్కూల్ డేస్ గురించి ధనుష్ ఏమన్నారంటే సార్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన చదువు గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. అప్పట్లో చదువును నిర్లక్ష్యం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలో చాలా అల్లరి పనులు చేశానని ధనుష్ గుర్తు చేసుకున్నారు. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్లో చేరానని, అక్కడ టీచర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో సిగ్గేసి కొన్ని రోజుల తర్వాత ట్యూషన్ మానేశానని పేర్కొన్నారు. అప్పట్లో తాను ఒక అమ్మాయి కోసం బయట వేచి చూస్తుండేవాడినని, తాను వచ్చినట్టు ఆమెకు తెలిసేందుకు బైక్‌తో సౌండ్ చేసేవాడినని అన్నారు. ఇది చూసి టీచర్ లోపలున్న విద్యార్థులతో.. మీరంతా బాగా చదువుకుని పరీక్షలు పాసైతే ఉన్నత స్థానాల్లో ఉంటారని, బయట బైక్‌తో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్ చేసుకోవాల్సిందేనని వారితో అన్న విషయం తనకు తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ టీచర్ చెప్పినట్టే తమిళనాడులో ప్రస్తుతం తాను డ్యాన్స్ చేయని వీధంటూ ఏమీలేదని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తానెందుకు సరిగ్గా చదువుకోలేదని అనిపిస్తూ ఉంటుందని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూ ఉంటానని అన్నారు. ఇప్పుడు ఆ మిత్రులందరిని ధనుష్ మరోసారి కలుసుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
65 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ!
దాదాపు 65 ఏళ్లు.. ఒకరినొకరు చూసుకొని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని..! ఇన్నాళ్లు వేచి చూస్తూ.. ఎలాగోలా కాలం గడిపిన ఆ వృద్ధ దంపతులు కలుసుకునే క్షణం రానేవచ్చింది. ఓ క్షణం ఉత్కంఠ, ఓ క్షణం ఉద్విగ్నత. ఎలా మాట్లాడుకోవాలో, ఏమని పలుకరించుకోవాలో తెలియని సందిగ్ధత.. చూసుకోవడంతోనే వారి హృదయాలు ఉప్పొంగాయి. కన్నీళ్లు వాటంతటవే ఉబికాయి.. ఇది లీ సూన్-గ్యూ-ఓహ్ ఇన్ సే దంపతుల అనుభవం. ఇరు కొరియాల మధ్య యుద్ధం రాజుకోవడంతో 1950, సెప్టెంబర్‌లో పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయిన వాళ్లు.. ఆరున్నర దశాబ్దాలు వేచివేచి.. ఆఖరికి కలుసుకోగలిగారు. కొరియాల యుద్ధం వల్ల వేరైన కుటుంబాల కలయిక కార్యక్రమం సందర్భంగా మంగళవారం వీరి అపూర్వ పునఃసంగమం సాధ్యపడింది. లీ సూన్ భార్యతో వేరయ్యే నాటికి 19 ఏళ్ల ఆమె ఆరు నెలల గర్భవతి. ఇప్పుడు వాళ్ల కొడుకు ఓహ్ జాంగ్ క్యూన్ వయసు 65 ఏళ్లు. వారిద్దరూ ఎన్నాళ్ల కిందటో తమతో వీడిపోయి సరిహద్దులకు ఆవల ఉండిపోయిన లీ సూన్ను కలిసేందుకు వచ్చారు. వారిని చూడగానే మొదట బలహీనంగా నవ్విన లీసూన్ తన పక్కన వచ్చి కూర్చోమని చెప్పాడు. ఇటు భార్య, అటు కొడుకు మధ్య కూర్చున్న లీ సూన్. దాదాపు పళ్లన్నీ ఊడిపోయి.. హియరింగ్ మెషీన్‌తో కష్టంగా వింటూ ఏవో కొన్ని మాటలు మాట్లాడాడు. రెండు కొరియాలను వేరుచేసే సరిహద్దు రేఖకు సమీపంలో ఉన్న కుంగ్యాంగ్ మౌంటైన్ రిసార్ట్‌లో వీరు కాసేపు కలుసుకున్నారు. వీరి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇలాంటిదే. అకస్మాత్తుగా వచ్చిపడిన యుద్ధంతో సరిహద్దుకు అటువైపు, ఇటువైపు ఉండిపోయి.. తిరిగి తమవారిని కలుసుకోలేకపోయిన ఆవేదనాభరితులే అక్కడ ఉన్నవాళ్లంతా. సరిహద్దుకు కేవలం అటు-ఇటు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నా.. ఇరుదేశాల మధ్య ఉన్న ద్వేషం వల్ల దశాబ్దాల పాటు తమవారికి దూరమయ్యారు. కొరియాల విభజన కారణంగా తమవారికి దూరంగా చెల్లాచెదురుగా ఉన్న 96 కుటుంబాలు ఈ కార్యక్రమంతో ఒకేచోట కలుసుకున్నారు. తమవారిని చూసి ఆనందబాష్పాలు రాల్చారు. వీరిలో అత్యంత వృద్ధుడు కూ సాంగ్ యూన్ (98). ఆయన వీడిపోయే ముందు తన కూతుళ్లకు బూట్లు కొనిస్తానని మాటిచ్చాడు. ఆ మాటను గుండెల్లో దాచుకొని.. ఇన్నాళ్లకు తనను మళ్లీ కలిసిన ఇద్దరు కూతుళ్లకు కొత్త బూట్లను కానుకగా ఇచ్చాడు. 71, 68 ఏళ్ల వయసున్న సుంగ్-జా, సున్-ఒక్ తమ తండ్రిని ఆప్యాయంగా హత్తుకొని ఆ కానుకను అందుకున్నారు. కొరియాల విభజన కారణంగా మొత్తం 66 వేల మంది సరిహద్దుకు రెండు వైపులా ఉండిపోయి తమవారికి దూరమయ్యారు. అందులో 96 కుటుంబాలు మంగళవారం ఒకటయ్యాయి.