సార్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యం
కరీంనగర్ సిటీ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
-
మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ సిటీ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రాన్ని జయశంకర్‌సార్ కోరుకున్నారని అన్నారు. దాని సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లలో సార్ ముందుంటారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ స్ఫూర్తినిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగె శోభ, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, ఎడ్ల సుగుణాకర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, జి.రఘువీర్‌సింగ్, దూలం సంపత్ పాల్గొన్నారు.