
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో 'సార్' సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ధనుష్‌కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్‌లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment