Dhanush Brother Director Selva Raghavan Tests Positive Covid 19: కరోనా మహమ్మారి విజృంభణ అస్సలు తగ్గేలా లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలను తన పంజాతో భయపెడుతోంది. ఇప్పటివరకు ఎంతో మంది నటీనటులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా తమిళ డైరెక్టర్, హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్‌కు జనవరి 23న కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు.
అలాగే వైద్యుల సలహాలు పాటించాలని సెల్వ రాఘవన్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇటీవల తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్‌లకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
🙏🏼🙏🏼 pic.twitter.com/jqqPQVEVOT
— selvaraghavan (@selvaraghavan) January 23, 2022
Comments
Please login to add a commentAdd a comment