విద్యారంగాన్ని విస్మరిస్తున్నారు : ఏఐఎఫ్‌డీఎస్
విద్యారంగాన్ని విస్మరిస్తున్నారు : ఏఐఎఫ్‌డీఎస్
Published Fri, Jul 29 2016 11:06 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
నర్సంపేట :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విస్మరించడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నార ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చౌటపెల్లి వేణుగోపాల్ అన్నారు. పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో శుక్రవా రం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తే విద్యార్థుల భవిష్యత్ మారుతుందని చెప్పిన కేసీఆర్ నేడు పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 42 హామీలను విస్మరించి ప్రభుత్వ విద్యావిధానాన్ని తుం గలో తొక్కారని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేసేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క గది లేకుండా 175 పాఠశాలలు నడుస్తున్నాయని, ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 44, వరంగల్ జిల్లాలో 31 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఎంసెట్–2 లీకేజీకి పాల్పడిన 72 మంది విద్యార్థులను పక్కనబెట్టి మిగతా విద్యార్థులకు న్యాయం చేయాల న్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మెత్రి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి మొగిళిచర్ల సందీప్, డివిజన్ అధ్యక్షుడు జన్ను రమేష్, నాయకులు ఆకుల రమేష్, సౌజన్య, సాయి, రఫీ, రామకృష్ణ, అరుణ్, గౌతమ్, స్వాతి, మౌని కొత్తకొండ రాజమౌళి పాల్గొన్నారు.
Advertisement