గంటలకొద్దీ సినిమాలు చూసి.. గిన్నిస్ రికార్డు | Man Watches Movies For 121 Hours Without Sleeping, Sets New Guinness World Record | Sakshi
Sakshi News home page

గంటలకొద్దీ సినిమాలు చూసి.. గిన్నిస్ రికార్డు

Published Wed, Dec 16 2015 12:00 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

గంటలకొద్దీ సినిమాలు చూసి.. గిన్నిస్ రికార్డు - Sakshi

గంటలకొద్దీ సినిమాలు చూసి.. గిన్నిస్ రికార్డు

గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అంటే ఆషామాషీ విషయం ఏమీ కాదు. అత్యున్నత ప్రపంచ రికార్డుకోసం ఒక్కోరూ ఒక్కో విన్యాసాన్ని ప్రదర్శిస్తుంటారు. సాహసాలకూ వెనుకాడరు. కొందరు ఇంతకు ముందున్న రికార్డును తిరగరాసే ప్రయత్నాలు చేస్తారు. అయితే కెనడా, జొహన్నెస్ బర్గ్ కు చెందిన ఓ యువకుడు ఏకంగా 121 గంటలపాటు (సుమారు ఐదు రోజులు) నిద్రపోకుండా సినిమాలు చూస్తూ రికార్డు సృష్టించేశాడు.

120 గంటల 23 మూడు నిమిషాలతో ఇంతకు ముందున్న గిన్నిస్ రికార్డును, 121 గంటల 18 నిమిషాలపాటు అంటే.. సుమారు గంట ఎక్కువ సమయం నిద్రపోకుండా ఉండి సురేష్ జోచిమ్ తిరగరాశాడు. అంతేకాదు.. ఆఫ్రికాలోనే తనకు మొదటి టైటిల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నాడు. ఇంతకు ముందు ఇండియాకు చెందిన ఆషిష్ శర్మ..120 గంటల 23 నిమిషాలపాటు 48 సినిమాలు చూసి గిన్నిస్ పుటలకెక్కగా... జోచిమ్ ఆ రికార్డును తిరగరాశాడు.

 

టెల్కాంకు చెందిన బోల్ట్ స్పీడ్ ఫైబర్ ద్వారా ఆగకుండా ప్రసారంచేసిన సినిమాలను చూస్తూ జోచిమ్ రికార్డు సృష్టించాడని, ఇలా స్ట్రీమింగ్ తో రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారని ఆ సంస్థ అధికారి జాక్వి చెప్పారు. జొహెన్నెస్ బర్గ్ డౌన్ టౌన్ లో  ఓ స్వచ్ఛంద సంస్థ సహాయార్థం నిర్వహించిన తమ అన్ లిమిటెడ్ మూవీ మారథాన్ లో.. వచ్చిన సొమ్మును ఆ సంస్థకు అందించినట్లు ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement