gst registration
-
జీఎస్టీ నమోదుకు ఆధార్ బయోమెట్రిక్!
న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్‌లను ధృవీకరించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. -
జీఎస్టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్!
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు కాని విక్రేతలను సైతం తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలకు అనుమతిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ‘మీషో’ ప్రకటించింది. వర్తకుల వార్షిక టర్నోవర్ వస్తువులకు రూ.40 లక్షల్లోపు, సేవలకు రూ.20 లక్షలకు మించకుండా ఉంటే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సరఫరాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే మినహాయించింది. దీంతో మీషో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వర్తకులు సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలకు వీలుగా టెక్నాలజీలో మార్పులు చేసినట్టు మీషో తెలిపింది. తాజా నిర్ణయంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌పై 14 లక్షల మంది విక్రేతలు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం గమనార్హం. -
బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!
Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్వాయిస్లు, బిల్లులు అడిగే సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్ మేరా అధికార్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్ ప్రాజెక్ట్) ఈ స్కీం షురూ కానుంది. ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి బంపర్ డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్లోడ్ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా, పుదుచ్చేరి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్ కానుంది. డ్రా అర్హతలు, నిబంధనలు ♦ జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయ్దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ జీఎస్టీ గుర్తింపు సంఖ్య, రిసీట్ నెం, డేట్, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ♦ డ్రాలో విజేతగా ఎంపికైన కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్ లేదా వెబ్‌పోర్టల్‌లో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ లాంటి వివరాలివ్వాలి. ♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్లోడ్ చేయవచ్చు ♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200 ♦ బీ2సీ రశీదులన్నింటినీ నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్లోడ్ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత ♦వీటిని 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ అప్లికేషన్లోను, 'వెబ్ డాట్ మేరాబిల్డాట్జీఎస్టీ డాట్ జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్లోడ్ చేయాలి. -
చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్
-
చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్
సాక్షి, అమరావతి: హెరాయిన్ సిండికేట్ సూత్రధారుల కేంద్ర స్థానం ఢిల్లీ. చెన్నైలో ఉండే పాత్రధారులు కథ నడిపిస్తుంటారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ సరఫరా అవుతుండగా.. ఇరాన్ మీదుగా గుజరాత్‌కు దిగుమతి అవుతోంది. ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో దానిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద హెరాయిన్ రాకెట్ ఈ దందా నడిపిస్తోంది. కానీ.. ఈ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని విజయవాడ పేరును వాడుకుంటోంది. వెలుగులోకి విభ్రాంతికర వాస్తవాలు గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీస్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ, కేంద్ర, రాష్ట్రాల పోలీసు వ్య వస్థల కళ్లుగప్పి దర్జాగా హెరాయిన్ దందా సాగిం చేందుకు ఈ సిండికేట్ వ్యూహాత్మకంగా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసిందని గుర్తించారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ దిగుమతి చేసిన ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని ఓ ఇంటి చిరునామాతో రిజిస్టర్ కావడంతో ఈ కేసు రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది. కాగా, హెరాయిన్ దందాతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం డీఆర్ఐ అధికారులను, పోలీసులను తప్పుదా రి పట్టించేందుకే విజయవాడ చిరునామాను ము ఠా వాడుకుందని వెల్లడైంది. గుజరాత్‌కు చేరిన భా రీ హెరాయిన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన అఫ్గాన్ జా తీయులు కొందర్ని డీఆర్ఐ అధికారులు అహ్మదా బాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన స మాచారం ఆధారంగా చెన్నైలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు దేశంలో వేళ్లూనుకున్న హెరాయిన్ దందా తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అఫ్గాన్ నుంచి.. ఇరాన్ మీదుగా.. దేశంలో హెరాయిన్ సిండికేట్ పక్కా ప్రణాళికతో అఫ్గానిస్తాన్ నుంచి దేశంలోకి భారీగా హెరాయిన్ ను దిగుమతి చేసుకుంటోందని డీఆర్ఐ తనిఖీల్లో వెల్లడైంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కొన్ని రోజులుగా డీఆర్ఐ అధికారులు జరుపుతున్న విస్తృ త తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4,500 కోట్లు ఉంటుం దని మొదట భావించగా.. ఆదివారానికి రూ.9 వేల కోట్లుగా తేలింది. సోమవారం తనిఖీలు పూర్తయ్యేసరికి ఆ హెరాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.21 వేల కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చెందిన ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ నెల 13, 14 తేదీల్లో ఈ హెరాయిన్ కన్సైన్మెంట్లను ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్ చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి గుజరాత్‌కు తరలించింది. టాల్కం పౌడర్ పేరిట భారీగా హెరాయిన్ ప్యాకెట్లను నౌకల్లో గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేర్చింది. ఢిల్లీలో సూత్రధారులు.. చెన్నైలోపాత్రధారులు సిండికేట్ సూత్రధారులు ఢిల్లీలోనూ, పాత్రధారులు చెన్నైలోనూ ఉంటూ ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో తేలింది. గుజరాత్‌కు చేరిన హెరాయిన్‌ను ఢిల్లీ తరలించాలన్నది ఆ సిండికేట్ లక్ష్యం. ఢిల్లీలో తమ గిడ్డంగిలో భద్రపరచి.. ఢిల్లీతోపాటు చండీగఢ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లోని విక్రయదారులకు వివిధ మార్గాల్లో తరలించాలన్నది సిండికేట్ వ్యూహమని గుర్తించారు. విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు వైశాలి డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లుగప్పేందుకు విజయవాడలోని ఇంటి చిరునామాను వాడుకున్నారు. ఆ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించారు. కానీ ఇక్కడ నుంచి ఆ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆ దంపతులు ఎన్నో ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్నారు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను విజయవాడ తరలించడం స్మగ్లర్ల లక్ష్యం కాదని, ఢిల్లీకి తరలించాలన్నదే వారి లక్ష్యమని విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డీఆర్ఐ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. – బి.శ్రీనివాసులు, సీపీ, విజయవాడ బురిడీ కొట్టించేందుకే విజయవాడ చిరునామా హెరాయిన్ సిండికేట్ డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వాడుకుంది. ఈ సిండికేట్‌లో పాత్రధారులైన చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలి వ్యూహాత్మకంగా విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని 23–14–16 డోర్ నంబర్‌తో ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎగుమతులు, గూడ్స్ సర్వీసులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తామని పేర్కొంటూ దుర్గాపూర్ణ వైశాలి పేరిట గతేడాది ఆగస్టు 10న జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఇల్లు దుర్గా పూర్ణ వైశాలి తల్లి తారక పేరున ఉంది. కానీ.. ఈ చిరునామా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. కేవలం రికార్డుల్లో చూపించేందుకే ఈ చిరునామాను వాడుకున్నారు. ఎప్పుడైనా డీఆర్ఐ అధికారులు తమ కన్సైన్మెంట్ను గుర్తిస్తే.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అషీ ట్రేడింగ్ సంస్థ తన వ్యాపార లావాదేవీల ఇన్వాయిస్ వివరాలను తెలిపే జీఎస్టీ ఆర్–1ను ఫైల్ చేయకపోవడం గమనార్హం. కేవలం చెల్లింపు వివరాలకు సంబంధించిన జీఎస్టీ ఆర్–3బీని మాత్రమే త్రైమాసికంగా ఫైల్ చేస్తోంది. ఇదిలావుంటే.. ఆ సంస్థకు దిగుమతులు చేసుకునేందుకు సంబంధించి విజయవాడ చిరునామాతో ఎలాంటి లైసెన్స్ తీసుకోలేదు. కాబట్టి గుజరాత్ ముంద్రా పోర్టులో దిగుమతి అయిన హెరాయిన్‌తో విజయవాడకు వాస్తవంగా ఎలాంటి సంబంధం లేదని డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ సిండికేట్ చెన్నై, ఢిల్లీ తదితర ప్రదేశాల్లో మరో చిరునామాతో దిగుమతుల లైసెన్స్‌ను తీసుకుని దందా సాగిస్తోందా అన్న దిశగా డీఆర్ఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, దుర్గాపూర్ణ వైశాలి తల్లి పేరిట విజయవాడలో గల ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న స్కూటర్ (ఏపీ 16 బీఎన్2268) గోవిందరాజు విద్యానాథ్, తండ్రి కోటేశ్వరశర్మ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఉంది. విజయవాడలోని ఆ చిరునామాలో కొంతకాలంగా ఎవరూ ఉండడం లేదు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న అఫ్గాన్ జాతీయులు ఇచ్చిన సమాచారంతో చెన్నైలో ఉంటున్న అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై కేంద్రాలుగా దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ రాకెట్ దందాపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ప్రత్యక్ష తనిఖీ తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు చేసుకునే వ్యాపార సంస్థలు ఆధార్ గుర్తింపు ధ్రువీకరణను ఇవ్వలేకపోతే.. ఆయా సంస్థల వ్యాపార స్థలాలను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి(సీబీఐసీ) స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారులు ఆధార్ ఆథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చని సీబీఐసీ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఆథార్ గుర్తింపు ధ్రువీకరణలో విఫలమైనా లేక ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోకపోయినా.. అటువంటి దరఖాస్తులకు సంబంధించి వ్యాపార కేంద్రాలను పరిశీలించిన తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని పేర్కొంది. దీనిపై పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ నేషనల్ లీడర్ ప్రతీక్ జైన్ స్పందిస్తూ.. ‘పన్ను చెల్లింపుదారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోరుకుంటే ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష పరిశీలన అవసరం లేకుండా 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుంది. లేదంటే 21 రోజులు పడుతుంది. అధికారులు ప్రత్యక్షంగా ఆయా వ్యాపార కేంద్రాలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తారు’’ అని వివరించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
► ఆయిల్ కంపెనీలకు సూచన ► రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ జేసీ కె.నాగేంద్ర అల్లిపురం(విశాఖ దక్షిణ): పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ కె.నాగేంద్ర స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లకు జీఎస్టీ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి రంగానికి జీఎస్టీ అవసరమన్నారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ.. నమోదు చేసుకోవడా నికి గల కారణాలు వివరించారు. రాష్ట్రానికి 45 శాతం పెట్రోలు రంగం ద్వారానే ఆదాయం వస్తోందన్నారు. ఏడాదికి రూ.9 వేల కోట్లు ఆదాయం పన్నుల రూపంలో వస్తోందన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆరు జిల్లాల నుంచి పెట్రోలు, డీజిల్ డీలర్లు పాల్గొన్నారు.