sellers
-
జీఎస్టీ లేకపోయినా పర్లేదు.. మీషో ఆఫర్!
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు కాని విక్రేతలను సైతం తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలకు అనుమతిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ‘మీషో’ ప్రకటించింది. వర్తకుల వార్షిక టర్నోవర్ వస్తువులకు రూ.40 లక్షల్లోపు, సేవలకు రూ.20 లక్షలకు మించకుండా ఉంటే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాష్ట్రాల మధ్య సరఫరాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను జీఎస్టీ కౌన్సిల్ ఇటీవలే మినహాయించింది. దీంతో మీషో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వర్తకులు సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలకు వీలుగా టెక్నాలజీలో మార్పులు చేసినట్టు మీషో తెలిపింది. తాజా నిర్ణయంతో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ప్లాట్‌ఫామ్‌పై 14 లక్షల మంది విక్రేతలు ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం గమనార్హం. -
మీషోలో 11 లక్షల మంది విక్రేతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ మీషోలో విక్రేతల సంఖ్య 11 లక్షల పైచిలుకు చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఎనిమిదేళ్లలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ (10 లక్షల) విక్రేతల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ డైరెక్టర్ ఉత్కర్‡్ష గర్గ్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిలో 80 శాతం మంది ఆన్లైన్లో తొలిసారిగా విక్రయిస్తున్నవారేనని చెప్పారు. తెలంగాణ నుంచి దాదాపు 17,000 పైచిలుకు చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయని గర్గ్ తెలిపారు. సున్నా కమీషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో గతేడాది రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంలో విక్రేతల సంఖ్య 20 శాతం పెరిగిందని చెప్పారు. ప్రాంతీయంగా హోమ్..కిచెన్, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోందని గర్గ్ తెలిపారు. మీషోలో సెల్లర్ల వ్యాపారం గత రెండేళ్లలో 82 శాతం పెరిగినట్లు గర్గ్ వివరించారు. గతేడాది తాము 91 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ రంగం 2030 నాటికి ఆరు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంబీ) అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పాటునివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గర్గ్ తెలిపారు. తమ విక్రేతల్లో 50 శాతం మంది రాజ్‌కోట్, హుబ్లి తదితర ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటున్నారని వివరించారు. -
డ్రగ్స దందాలో సరికొత్త పంథా...వినియోగిస్తూ.. విక్రయిస్తూ..
సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్ కొన్నేళ్ల క్రితం డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. కాలక్రమంలో వినియోగించడంతో పాటు అందుకు అవసరమైన డబ్బు కోసం విక్రయించడమూ ప్రారంభించారు. గౌలిగూడ వాసి అశుతోష్ కొన్నేళ్లుగా మియాపూర్‌కు చెందిన లక్కీ నుంచి గంజాయి, హష్ ఆయిల్ ఖరీదు చేసి వినియోగిస్తున్నాడు. ఆపై స్నేహితులు, పరిచయస్తులకు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. వీరితో పాటు వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారినీ గత గురు–శుక్రవారాల్లో హెదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. కేవలం వీళ్లే కాదు.. కొన్నాళ్లుగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను పరిశీలిస్తే... సరదా కోసం డ్రగ్స్ వాడటం మొదలెట్టిన వారిలో 95 శాతం మంది వాటికి బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి వినియోగదారుల్లో 40 శాతం విక్రేతల అవతారం ఎత్తుతున్నారని పోలీసులు గుర్తించారు. నిఘాతో పాటు పెరుగుతున్న రేటు... రాజధానికి గంజాయితో పాటు దాని సంబంధిత పదార్థమైన హష్ ఆయిల్ విశాఖ, అదిలాబాద్ ఏజెన్సీల నుంచి వచ్చి చేరుతోంది. హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ బోల్ట్స్ వంటి మాదకద్రవ్యాలు గోవాతో పాటు ఇతర మెట్రోల నుంచి వచ్చేవి. అయితే పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో మాకద్రవ్యాల దందా డార్క్ నెట్ ద్వారా జరుగుతోంది. వీటి క్రయవిక్రయాలపై నిçఘా ఏస్థాయిలో ఉంటే... వాటి రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ కారణంగానే వీటికి బానిసలుగా మారిన యువత ఆ ‘ఖర్చు’ల కోసం విక్రేతలుగా మారుతున్నారు. కాస్త ఎక్కువ మొత్తంలో వాటిని తెప్పించి స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని హెచ్–న్యూ అధికారులు చెప్తున్నారు. వారి కంటే వీరికే ఎక్కువ శిక్షలు... డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. న్యాయస్థానిల్లో నిందితులు దోషులుగా నిరూపితమైనప్పుడు ఇందులోని సెక్షన్ల ప్రకారమే శిక్షలు పడతాయి. ఈ చట్ట ప్రకారం వినియోగదారుల కంటే విక్రేతలకు ఎక్కువ శిక్షలు ఉంటాయి. ఏ నిందితుడు వినియోగదారుడు? ఎవరు విక్రేత అనేది అరెస్టు సమయంలో వారి వద్ద లభించిన డ్రగ్, గంజాయి పరిమాణంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిర్థారిస్తారు. ప్రొఫెషనల్ డ్రగ్ పెడ్లర్లు కాకపోయినా... ఖర్చుల కోసం ఈ దందా చేసినా అదే స్థాయిలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లే పెడ్లర్లుగా మారుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవన్నీ డ్రగ్స్ బానిసల లక్షణాలు: నగరంలోని డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతల్లో అనేక మందిని హెచ్–న్యూ పట్టుకుంది. వీరిని పరిశీలించడంతో పాటు విచారించిన నేపథ్యంలో అనేక సారూప్యతలు ఉన్న లక్షణాలను గుర్తించింది. ఇవి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని, వీటిలో ఏవైనా వారి పిల్లల్లో కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది. మాదకద్రవ్యాలతో పాటు గంజాయి, హష్ ఆయిల్ వంటి వాటికి బానిసలుగా మారిన యువతలో అనేక మంది తమ ఒంటిపై టాటూస్ ఎక్కు వ సంఖ్యలో వేయించుకుంటున్నారు. వీటిలోనూ పుర్రెలు, కొన్ని రకాలైన పూలు ఉంటున్నాయి. డ్రగ్స్ వినియోగదారులు వినే సంగీతం కూడా అసాధారణంగా ఉంటోంది. సైకొడెలిక్‌గా పిలిచే చిత్రమైన మ్యూజిక్‌ను వింటుంటారు. టెక్నో, ట్రాన్స్ మ్యూజిక్స్‌గా పిలిచే వీటిలో లిరిక్స్ కంటే మ్యూజిక్కే ఎక్కువగా ఉంటుంది. ఇది వింటూ మత్తులో జోగుతుంటారు. వీరిని ఎదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే విధానం సుదీర్ఘంగా ఉంటుంది. చిత్రమైన డిజైన్లతో కూడిన దుస్తులు ధరించడం, విభిన్నమైన హెయిల్ స్టైల్స్ కలిగి ఉండటం కూడా బానిసల లక్షణాలు. వీళ్లు ఎక్కువగా టీషర్టులు, చిత్రమైన షర్టులు ధరిస్తూ ఉంటారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు సాధారణంగా ఒక్కరుగా వాటిని తీసుకోరు. ఎక్కువగా గ్రూప్ పార్టీలు నిర్వహిస్తూ, వాటికి హాజరవుతూ ఉంటారు. తరచుగా గోవాకు వెళ్లివస్తున్న యువత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్–న్యూ అధికారులు సూచిస్తున్నారు. (చదవండి: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. ) -
తూనికలు, కొలతల చట్టాలు సవరిస్తాం
న్యూఢిల్లీ: వ్యాపారాలు, వినియోగదారులపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా తూనికలు, కొలతల ప్రమాణాలకు సంబంధించిన లీగల్ మెట్రాలజీ చట్టం–2009లో సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. సంబంధిత ముసాయిదా ప్రతిపాదనను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను పరిశీలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అనుచిత వ్యాపార విధానాలను కట్టడి చేసేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ సవరణలను తలపెట్టినట్లు ఆయన తెలిపారు. చట్టాలు, నిబంధనలను సరళతరం చేసేందుకు సూచనలేమైనా ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ చెప్పారు. వినియోగదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫిర్యాదులు చేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ’ఈ–దాఖిల్’ సదుపాయానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 40,000 పైచిలుకు ఫిర్యాదులు ఈ ప్లాట్‌ఫాంపై దాఖలైనట్లు వివరించారు. అయితే, మరింత మందికి దీని గురించి తెలిసే విధంగా అవగాహనను పెంచాల్సి ఉందని చెప్పారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఫిర్యాదిదారు సులభంగా ఆన్లైన్లో అప్పీలు చేసుకోవడానికి, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కోర్టు విచారణకు హాజరవడానికి వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. చిన్న నగరాల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాలి .. ప్రథమ, ద్వితీయ శ్రేణి చిన్న నగరాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ మూడో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. విజయవంతమైన స్టార్టప్‌లు తమ అనుభవాలను యువతతో పంచుకోవాలని, వారిలో ఎంట్రప్రెన్యూర్షిప్ స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. దేశీయంగా అంకుర సంస్థల్లో 45% స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉంటున్నాయని.. 623 జిల్లాల్లో కనీసం ఒక్కటైనా గుర్తింపు పొందిన స్టార్టప్ ఉందని ఆయన తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2018–21 మధ్య కాలంలో స్టార్టప్‌లు దాదాపు 5.9 లక్షల ఉద్యోగాలు కల్పించాయి. చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్.. -
భారత్‌లో అమెజాన్ సరికొత్త మైలురాయి..! 100 నుంచి ఏకంగా 10 లక్షల వరకు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సరికొత్త మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 10 లక్షల మంది విక్రయదారులు అమెజాన్‌లో ఆన్‌బోర్ట్ ఐన్నట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 100 నుంచి మొదలు..! 2013లో అమెజాన్ ఇండియా కేవలం 100 మంది విక్రయదారులను ఆన్‌బోర్డ్ చేసుకోగా..ప్రస్తుతం ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. Amazon.inలో 90 శాతం కంటే ఎక్కువ మంది విక్రేతలు చిన్న, మధ్యస్థ స్థానిక వ్యాపారాలను కల్గి ఉన్నారు. వీరు టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చారు. 2020 జనవరి నుంచి 4.5 లక్షలకు పైగా కొత్త విక్రేతలు అమెజాన్‌లో చేరారని కంపెనీ పేర్కొంది. చదవండి: సమ్మె మా కోసం కాదంటూ..’ 10 లక్షల మంది నిరసన 63 మిలియన్ల ఎమ్ఎస్ఎమ్ఈలతో... భారత్‌లోని పలు ఎమ్ఎస్ఎమ్ఈలపై అమెజాన్ ఇండియా దృష్టిసారించింది. సుమారు 63 మిలియన్ల మధ్యస్థ,చిన్న సూక్ష్మ పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను అమెజాన్ నెలకొల్పింది. స్థానిక రిటైలర్లకు వారి వ్యాపారాల అభివృద్ధికి అమెజాన్ ఎంతగానో సహయం అందించిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ అన్నారు. చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
అమ్మేవి చాయ్, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్‌లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొందరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట. ఈ పుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు. హిందూస్థాన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
అమెజాన్ వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా
నమోదిత వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా ఉచితంగా కల్పిస్తున్నట్టు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50,000 వరకు కవరేజ్ ఉంటుందని వెల్లడించింది. బీమా సంస్థ ఆకో జనరల్ ఇన్సూరెన్స్‌తో అమెజాన్ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కాల పరిమితి ఒక ఏడాది ఉంటుంది. 2020 జనవరి 1 నుంచి 2021 మే 1 మధ్య అమెజాన్.ఇన్ పోర్టల్‌లో నమోదైన వర్తకులు అర్హులు. వర్తకులు తమ పేర్లను 30 రోజుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి యూనిక్ హెల్త్ ఐడెంటిఫికేషన్ సంఖ్యను బీమా సంస్థ కేటాయిస్తుంది. క్లెయిమ్, రీఇంబర్స్మెంట్స్ కోసం ఈ నంబరును వినియోగించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకున్నా బీమా వర్తిస్తుంది. మహమ్మారి వేళ వర్తకుల ఆరోగ్య బీమాకు అయ్యే ఖర్చును తామే భరిస్తున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది సైతం అమెజాన్ తన వర్తకులకు కోవిడ్-19 ఆరోగ్య బీమా కల్పించింది. చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు -
అమెజాన్‌కు ఏమైంది?
ఒకవైపు మార్కెట్ క్యాప్‌లో అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. మరోవైపు టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యకుతో విడాకులకు సిద్ధం..ఇంకోవైపు అమెజాన్‌లో విక్రయదారుల భారీ డేటాలీక్‌తో అమెజాన్ వార్తల్లో నిలిచింది. అంతర్గత వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా పలు అమెజాన్ ఇండియా పోర్టల్‌లో విక్రయదారుల డేటా లీక్ అయింది. ముఖ్యంగా సెల్లర్స్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు అక్రమంగా బహిర్గతం కావడం కలకలం రేపింది. వరుస డేటాలీక్స్ సోషల్ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్బుక్ ఖాతాల డేటాబ్రీచ్ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్ ఇండియాలో మరో డేటా బ్రీచ్ కలకలం రేపింది. అమెజాన్‌లో నమోదైన సెల్లర్స్ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్లోడింగ్ సందర్భంగా సమస్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్ అంశాన్ని గమనించామని వెల్లడించింది. అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రకటించింది. అయితే ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. కాగా అమెజాన్‌లో దాదాపు150 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు వుండగా, సుమారు 40 లక్షలమంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ్యంలో తాజా డాటాలీక్ ప్రభావానికి ఎంతమంది గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్ ఫిర్యాదు చేశారనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కూడా అమెజాన్‌లో దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది. -
నిషేధం అమలెక్కడ?
ఆరోగ్యానికి హానికరంగా పరిణమించిన గుట్కాలను ప్రభుత్వం నిషేధించినా జిల్లాలో అమలు కావడం లేదు. గడిచిన ఆరు నెలల కాలంలో 31కి పైగా కేసులు నమోదవడం, రూ.కోట్లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం నిఘా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా గుట్కా వ్యాపారం జోరందుకోవడానికి కారణమని తెలుస్తోంది. భువనగిరి : నిషేధిత గుట్కా వ్యాపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. నిషేధించిన కొంతకాలం పాటు గుట్టుగా సాగిన వ్యాపారం మళ్లీ రెక్కలు విప్పుకుంది. జిల్లాలో పోలీసులు ఇటీవల భారీగా గుట్కాలను పట్టుకు న్న విషయం తెలిసిందే. పట్టుబడిన గుట్కాలకు సంబంధించి సరఫరా చేస్తున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాలు గుట్కా వ్యాపారానికి అడ్డాలుగా మారాయి. పట్టపగలే సరఫరా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెద్ద మొత్తంలో గుట్కాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జిల్లాలో గుట్కాల వ్యాపారం జోరుగా జరుగుతుందని చెప్పడానికి ఈసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 31కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ కేంద్రంగా.. ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, జర్దా మాఫియా మళ్లీ పుంజుకుంటోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతాపూర్, పాతబస్తీ, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గుట్కాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం అధికారుల నిఘా కొరవడటంతో రోజూ లక్షల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది. బస్సుల్లో సరఫరా.. భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి కేంద్రాల నుంచి ప్రతి రోజూ సుమారు 70 నుంచి 120 మంది అక్రమార్కులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి గుట్కాలను జిల్లాకు తీసుకువస్తున్నారు. అక్రమార్కులు తాము కొనుగోలు చేసిన గుట్కాలను ఎవరికీ అనుమానం రాకుండా బట్టల బ్యాగుల్లో బిగించుకుని ఆర్టీసీ బస్సులో ఎక్కుతున్నారు. ఇలా బస్సుల్లో వచ్చి బస్టాండ్‌కు కొంత దూరంలో ఉన్న స్టేజీల వద్దనే దిగుతున్నారు. అనంతరం వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారుల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. గుట్కాలను ప్రధానంగా టీస్టాల్స్, పాన్‌షాపులు, కిరాణం, దాబాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం.. జిల్లాలో 7,39,448జనాభా ఉంది. ఇందులో గుట్కాలు తినే అలవాటు సుమారు 5శాతం మందికి ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 36,972మంది గుట్కాలు అమ్ముడవుతుండగా సగటున ఒక్క వ్యక్తి రోజుకు రెండు గుట్కాల చొప్పున తినేస్తున్నాడు. రూ.5 ఉన్న గుట్కాను రూ.10కి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 73,944 గుట్కా ప్యాకెట్లను తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.దీని ప్రకారం రోజూ రూ.7,39,440 విలువ చే సే వ్యాపారం జరుగుతుంది. ఒక్క నెలలో రూ. 22,18,3200 వ్యాపారం జరగగా ఏటా 26.61కోట్ల బిజినెస్ నడుస్తుంది. జిల్లాలో పట్టుబడిన గుట్కాల వివరాలు కొన్ని.. ఈనెల 20వ తేదీన భువనగిరి పట్టణంలో రూ.1.72లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 18న భువనగిరిలోని అర్బన్కానీలో రూ.18వేలు విలువ చేసే గుట్కాలను విక్రయిస్తుండగా పట్టుకున్నారు. బీబీనగర్ మండలం నెమురగోములలో ఫిబ్రవరిలో రూ.2లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈనెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలో రూ.20విలువ చేసే గుట్కాలను పట్టుకున్నారు. వీటితోపాటు జిల్లాలో మొత్తం 31కేసులు నమోదు చేయగా 31మందిని అరెస్టు చేశారు. కేసులు నమోదు చేస్తాం జిల్లాలో నిషేధిత గుట్కాలు విక్రయించిన, కొనుగోలు చేసిన గుట్కాలను సరఫరా చేయడంలో మధ్యవర్తిత్వం వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో గుట్కాలు విక్రయించే వారి దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాం. అవసరమైతే ప్రత్యేక దాడులు నిర్వహిస్తాం. – భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి -
వ్యాపారులపై ఉక్కుపాదం
ఎటువంటి నోటీసులు లేకుండా దుకాణాల తొలగింపు రోడ్డున పడ్డ 200 మంది వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వ్యాపారులు ఐ.పోలవరం : జాతీయ రహదారి 216 విస్తరణ పనుల పుణ్యమా అని మురమళ్లలో వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే సుమారు 200 మంది రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే వారిపై ఉక్కుపాదం మోపారు. గత వంద సంవత్సరాలుగా మురమళ్ల రహదారికి ఆనురేని ఇరువైపులా బడ్డిలు, దుకాణాలు వేసుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం, భరోసా ఇవ్వని ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ పరిస్థితి.. ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్రవారధి నుంచి కొమరగిరి వరకూ జాతీయ రహదారి ఇరువైపులా పంటకాలువకు ఆనుకొని బడ్డీలు, తా త్కాలిక దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సందడిలో సడేమియా అన్న చందా గా హైవే విస్తరణ నేపథ్యంలో పూర్తిగా హైవే స్థలా న్ని ఖాళీ చేయాలని అధికారులు పట్టుపడ్డారు. అయితే వ్యాపారస్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు రావడంతో అధికారులు, ప్రజాప్రతి నిధులు ఒక అడుగు వెనక్కు వేసి కొంత ఉపశమ నం కలిగించేలా వారికి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా మొదట ఇరువైపులా 10 మీటర్లు స్థల సే కరణ చేసి మార్కింగ్ ఇచ్చారు. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మార్కింగ్ వరకూ వెనక్కి మళ్లించుకుని కుదించుకున్నారు. రాజకీయ దురుద్దేశంతో.. అధికార నాయకుల ప్రోత్సాహంతో పంట కాలువ దిగువున ఉన్న రైతులు, వ్యాపార సంస్థలు తొలగించాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దుకాణాల వెనుక ఉన్న కాలువలో వ్యర్థాలు తదితర వాటి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నామని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్న వ్యాపార సంస్థలను కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఉన్న దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో వ్యాపారస్తులు విస్మయానికి గురయ్యారు. రైతుల సాగునీటì ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూస్తామని వ్యాపారస్తులు చెప్పినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిర్ధాక్షినంగా వ్యవహరించారు. పంట కాలువలు ఆక్రమణలకు గురై శివారు భూములకు నీరు అందక పోవడం జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉన్న దుకాణాలను తొలగించడంపై వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోనే కాకుండా ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంక, పల్లంకుర్రు ప్రధాన పంటకాలువతో పాటు మీడియం, మైనర్ కాలువల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతుంటే మురమళ్లలోనే తొలగించడంపై ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 15 మంది వ్యాపారులు కోర్టు స్టే తెచ్చుకున్నా తొలగించారని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కలుగజేసుకుని వీధిన పడ్డ చిరు వ్యాపారులకు తగిన నష్ట పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
లక్ష మార్క్ దాటేసిన అమెజాన్
ముంబై : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తన ప్లాట్ ఫామ్ పై లక్ష అమ్మకందారుల మైలురాయిని చేధించింది. యేటికేటికి 250 శాతం అమ్మకందారుల వృద్ధిని నమోదుచేసుకుంటూ.. వ్యాపారాల్లో దూసుకెళ్తోంది. అమెజాన్ భారత్ లో అడుగుపెట్టిన మూడేళ్లలో వివిధ వ్యాపార అవసరాలను తీర్చేందుకు అమ్మకందారుల తరుఫున పనిచేస్తూ.. ఆన్ లైన్ లో తమ బిజినెస్ లు పెంచుకునేందుకు సహకరిస్తోందని అమెజాన్ ఇండియా జనరల్ మేనేజర్, సెల్లర్ సర్వీసుల డైరెక్టర్ గోపాల్ పిల్లై పేర్కొన్నారు. దీంతో తమ ప్లాట్ ఫామ్ పై ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లక్ష అమ్మకందారులకు పైగా కలిగి ఉన్నామని ఆయన వెల్లడించారు. 2013 జూన్ లో అమెజాన్ భారత్ లో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించింది. విస్తృతమైన విద్య, నైపుణ్యమైన ప్రోగ్రామ్ లు చేపట్టడం, అమ్మకందారుల తరుఫున ఉత్పత్తులకు అమెజాన్.ఇన్ ప్యాకింగ్, షిప్స్, డెలివరీ నిర్వహించడం, రిటర్న్ లను నిర్వహించడం, ఇతర సర్వీసులను అమెజాన్ అందిస్తోంది. ఒక్క భారత్ లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా.. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా 3040 లక్షల యాక్టివ్ కస్టమర్లను అమెజాన్ కలిగి ఉన్నట్టు పిల్లై తెలిపారు. గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కింద 8వేల అమ్మకందారులు ప్రపంచవ్యాప్తంగా ఉండే దుకాణదారులకు, తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెజాన్ తన ప్లాట్ ఫామ్ అమ్మకందారులకు రూ.5లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు సెక్యూర్డ్, అన్ సెక్యూర్డ్ రుణాలను అందిస్తోంది.