వ్యాపారులపై ఉక్కుపాదం
వ్యాపారులపై ఉక్కుపాదం
Published Sun, Oct 9 2016 11:45 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
ఎటువంటి నోటీసులు లేకుండా దుకాణాల తొలగింపు
రోడ్డున పడ్డ 200 మంది వ్యాపారులు
అధికార పార్టీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించిన
అధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వ్యాపారులు
ఐ.పోలవరం : జాతీయ రహదారి 216 విస్తరణ పనుల పుణ్యమా అని మురమళ్లలో వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే సుమారు 200 మంది రోడ్డున పడ్డారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే వారిపై ఉక్కుపాదం మోపారు. గత వంద సంవత్సరాలుగా మురమళ్ల రహదారికి ఆనురేని ఇరువైపులా బడ్డిలు, దుకాణాలు వేసుకుని జీవనోపాధి సాగిస్తున్నారు. అధికారుల అత్యుత్సాహం, భరోసా ఇవ్వని ప్రజాప్రతినిధుల వల్ల వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి..
ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్రవారధి నుంచి కొమరగిరి వరకూ జాతీయ రహదారి ఇరువైపులా పంటకాలువకు ఆనుకొని బడ్డీలు, తా త్కాలిక దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సందడిలో సడేమియా అన్న చందా గా హైవే విస్తరణ నేపథ్యంలో పూర్తిగా హైవే స్థలా న్ని ఖాళీ చేయాలని అధికారులు పట్టుపడ్డారు. అయితే వ్యాపారస్తుల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు రావడంతో అధికారులు, ప్రజాప్రతి నిధులు ఒక అడుగు వెనక్కు వేసి కొంత ఉపశమ నం కలిగించేలా వారికి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా మొదట ఇరువైపులా 10 మీటర్లు స్థల సే కరణ చేసి మార్కింగ్ ఇచ్చారు. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మార్కింగ్ వరకూ వెనక్కి మళ్లించుకుని కుదించుకున్నారు.
రాజకీయ దురుద్దేశంతో..
అధికార నాయకుల ప్రోత్సాహంతో పంట కాలువ దిగువున ఉన్న రైతులు, వ్యాపార సంస్థలు తొలగించాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దుకాణాల వెనుక ఉన్న కాలువలో వ్యర్థాలు తదితర వాటి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నామని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్న వ్యాపార సంస్థలను కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఉన్న దుకాణాలను నేలమట్టం చేశారు. దీంతో వ్యాపారస్తులు విస్మయానికి గురయ్యారు. రైతుల సాగునీటì ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చూస్తామని వ్యాపారస్తులు చెప్పినప్పటికీ ఇరిగేషన్ అధికారులు నిర్ధాక్షినంగా వ్యవహరించారు. పంట కాలువలు ఆక్రమణలకు గురై శివారు భూములకు నీరు అందక పోవడం జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలోనే ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఉన్న దుకాణాలను తొలగించడంపై వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోనే కాకుండా ధవళేశ్వరం నుంచి బొబ్బర్లంక, పల్లంకుర్రు ప్రధాన పంటకాలువతో పాటు మీడియం, మైనర్ కాలువల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతుంటే మురమళ్లలోనే తొలగించడంపై ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 15 మంది వ్యాపారులు కోర్టు స్టే తెచ్చుకున్నా తొలగించారని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కలుగజేసుకుని వీధిన పడ్డ చిరు వ్యాపారులకు తగిన నష్ట పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement