Amazon Provides Free Covid-19 Health Insurance For Its Sellers - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ వర్తకులకు కోవిడ్‌-19 ఆరోగ్య బీమా

Published Fri, May 28 2021 3:03 PM | Last Updated on Fri, May 28 2021 3:35 PM

Amazon India to Arrange Free Covid 19 Health Cover for sellers - Sakshi

నమోదిత వర్తకులకు కోవిడ్‌-19 ఆరోగ్య బీమా ఉచితంగా కల్పిస్తున్నట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50,000 వరకు కవరేజ్‌ ఉంటుందని వెల్లడించింది. బీమా సంస్థ ఆకో జనరల్‌ ఇన్సూరెన్స్‌తో అమెజాన్‌ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కాల పరిమితి ఒక ఏడాది ఉంటుంది. 2020 జనవరి 1 నుంచి 2021 మే 1 మధ్య అమెజాన్‌.ఇన్‌ పోర్టల్‌లో నమోదైన వర్తకులు అర్హులు. వర్తకులు తమ పేర్లను 30 రోజుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

వీరికి యూనిక్‌ హెల్త్‌ ఐడెంటిఫికేషన్‌ సంఖ్యను బీమా సంస్థ కేటాయిస్తుంది. క్లెయిమ్, రీఇంబర్స్‌మెంట్స్‌ కోసం ఈ నంబరును వినియోగించాల్సి ఉంటుంది. ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకున్నా బీమా వర్తిస్తుంది. మహమ్మారి వేళ వర్తకుల ఆరోగ్య బీమాకు అయ్యే ఖర్చును తామే భరిస్తున్నామని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీశ్‌ తివారీ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది సైతం అమెజాన్‌ తన వర్తకులకు కోవిడ్‌-19 ఆరోగ్య బీమా కల్పించింది.

చదవండి: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement