మెగాకపుల్ రామ్ చరణ్-ఉపాసన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఈ మధ్య కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. ఆమెతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. మూడురోజుల ముందు భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా కుమార్తె క్లీంకారకి సంబంధించిన వీడియోని చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందరికీ ఆ వీడియో తెగ నచ‍్చేసింది. ఇదంతా పక్కనబెడితే తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. ఉపాసన-తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!)
క్లాత్స్ విక్రయించే ఓ యాప్‌కి రామ్ చరణ్ ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిని కమెడియన్ తన్మయ్ భట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా తన స్టైలింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటానని చరణ్ చెప్పుకొచ్చాడు. అలానే తనకు పెళ్లి అయిన కొత‍్తలో భార్య ఉపాసనకు ఎంతో కష్టపడి ఓ గిఫ్ట్ ఇస్తే, దాన్ని అవతల పారేసిందని అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
'పెళ్లయిన కొత్తలో ఓసారి ఉపాసన కోసం కాస్ట్‌లీ గిఫ్ట్ తీసుకున్నాను. ఆ వస్తువు కొనడానికే దాదాపు ఐదు గంటలు పట్టింది. తీరా తీసుకెళ్లి ఆమెకు ఇస్తే కనీసం ఐదు సెకన్ల కూడా చూడలేదు. పక్కన పడేసింది. అందుకే ఆడవాళ్లకు సర్‌ప్రైజులు ఇవ్వొద్దు. వారికి కూడా అవి నచ్చవేమో. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అని నా ఫీలింగ్' అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!)
Comments
Please login to add a commentAdd a comment