
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. టీఎస్‌ఐఐసీ వీసీఎండీ వెంకటనర్సింహారెడ్డి, సీఈఓ సుధాకర్, ఉన్నతాధికారులతో పాటు ముస్లిం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమతాల ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీక అని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్, సీజీఎం గీతాంజలి, జనరల్ మేనేజర్లు కళావతి, సునీతా బాయి, డీజీఎంలు కవిత, దీపక్ కుమార్, జోనల్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు.