TSIIC Office
-
టీఎస్ఐఐసీలో ఘనంగా ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. టీఎస్ఐఐసీ వీసీఎండీ వెంకటనర్సింహారెడ్డి, సీఈఓ సుధాకర్, ఉన్నతాధికారులతో పాటు ముస్లిం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమతాల ఐక్యతకు రంజాన్ పండగ ప్రతీక అని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్, సీజీఎం గీతాంజలి, జనరల్ మేనేజర్లు కళావతి, సునీతా బాయి, డీజీఎంలు కవిత, దీపక్ కుమార్, జోనల్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో శక్తిమాన్ ఆగ్రోటెక్ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి పరిశ్రమతో పాటు నైపుణ్య కేంద్రం ఏర్పాటు కోసం తీర్థ్ ఆగ్రో టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్(శక్తిమాన్)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 50 శాతానికి పైగా వాటాతో దేశంలో అతిపెద్ద వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి సంస్థగా శక్తిమాన్ ఖ్యాతిగడించింది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు సమక్షంలో అధికారులు శక్తిమాన్ యాజమాన్యంతో గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. శక్తిమాన్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోటరీ టిల్లర్స్, పవర్ హారోస్, మెకానికల్ సీడ్ డ్రిల్స్, కంపోస్ట్ ష్రెడ్డర్స్, ఫ్లైయిల్ మువర్స్ తదితర యంత్రాల ఉత్పత్తి పరిశ్రమతో పాటు రైతులకు శిక్షణ కోసం వ్యవసాయ/ఉద్యానవన/ నీటి సంరక్షణ ప్రదర్శన క్షేత్రాలను శక్తిమాన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. శక్తిమాన్ వ్యవసాయ యంత్రాల ఉత్పత్తిలో రాజ్కోట్ తర్వాత హైదరాబాద్ రెండో పెద్ద కేంద్రంగా ఆవిర్భవించనుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థ ద్వారా 500 మందికి ప్రత్యక్ష, 1500 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వైస్ చైర్మెన్, ఎండీ ఈ.వెంకటనర్సింహా రెడ్డి, శక్తిమాన్ గ్రూప్ చైర్మన్ అశ్విన్ గోహిల్ తదితరులు పాల్గొన్నారు.