కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై పోరాడకపోతే భావితరాలు క్షమించవని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కన్వీనర్ రత్నాకర్‌రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ఈనెల 26న హైదరాబాదులో జరిగే సమైక్య శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమైక్య రాష్ట్రం తమ పార్టీ విధానమని రాజీనామాలతో పాటు ఏ త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత తరలిరావాలన్నారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండానే న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమ్మె విరమించడం తగన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు నాగన్న, వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, నాగేంద్ర, రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోరాడకపోతే భావితరాలు క్షమించవు
Published Mon, Oct 21 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement