RTC union
-
కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి
చంపాపేట: కార్మికుల సంక్షేమం కోసం సంఘాలు, యూనియన్ల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కని, వాటిని కాలరాయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్‌లో మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి ఏర్పాటు చేసిన కేంద్రకమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళన బాట పట్టక తప్పదన్నారు. బస్సుల సంఖ్యను కుదించటం వల్ల కార్మికులు డ్యూటీల కోసం బస్‌డిపోల ముందు పడిగాపులు కాయటమే కాకుండా ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. -
ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అల్టిమెట్టం
సాక్షి, హైదరాబాద్: రేపు అర్థరాత్రిలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ పలు అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తామని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేశారు. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా కార్మికులకు మంచి అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. దాన్ని కార్మికులు ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయడమా ? అనేది వారే తేల్చుకోవాలన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న ప్రభుత్వం కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించిందని పేర్కొన్నారు. హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదన్నారు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. గతానుభాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కేసుల విచారణ సాగుతుందన్నారు. అది అంతంలేని పోరాటం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, సునిల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్ రావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అల్టిమెట్టం
-
టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి హరీశ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఎంయూ(తెలంగాణ మజ్దూర్ యూనియన్) గౌరవాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డికి పంపారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు
-
ఆర్టీసీలో ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు
తెలంగాణ ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 194 డిపోల్లో సుమారు 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలలో 14 యూనియన్లు పోటీపడుతున్నాయి. మెజారిటీ డిపోలను గెలుపొందిన యూనియన్లకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించనుంది. దీంతో డిపోల వారీగా యూనియన్లను గెలిపించుకునేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీ ప్రధానంగా మూడు యూనియన్ల మధ్య ఉంది..నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఓటింగ్ అనంతరం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. డిపోల వారీగా లెక్కింపు జరిగిన వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఆందోళనల బాటలో ఆర్టీసీ కార్మిక సంఘాలు
విజయవాడ: ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు సోమ, మంగళవారాల్లో ఆందోళన బాట పట్టనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 4న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు ప్రకటించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, ఆర్టీసీ ఆసుపత్రి నిర్మించాలనే డిమాండ్స్‌పై ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 5 నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల ప్రక్రియ మొదలుకానుండటంతో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆందోళనలకు పిలునిచ్చింది. ఈ నెల 5న రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ రీజినల్ సెంటర్లలో ధర్నా నిర్వహించనున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య ఆదివారం సాక్షికి చెప్పారు. -
'ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నాం'
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నామని కార్మిక సంఘం నేత పద్మాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఏపీ మంత్రివర్గం ఉపసంఘం కార్మిక సంఘాల నేతలతో సమావేశమైనా.. అవి సఫలం కాలేదు. కాగా, కార్మికుల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక ఇచ్చినట్లు పద్మాకర్ తెలిపారు.ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినా భారం పడదని.. తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిశీలనకు మూడు వారాల గడువు కోరారని.. అయితే దానిపై ఏపీలోని అన్ని ఇతర సంఘ నేతలు, జిల్లా సమాఖ్యలతో మాట్లాడి నిర్ణయం చెబుతామని పద్మాకర్ తెలిపారు. ఈనెల 12న హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ప్రస్తుతం 60 శాతం బస్సులు తిప్పుతున్నామన్న యాజమాన్యం లెక్కలు అవాస్తవమని.. అది నిజమైతే ఆర్టీసీ ఖాతాలో రూ.9కోట్లు జమ కావాలని.. రూ.10 లక్షల కూడా జమ కాలేదని పద్మాకర్ ఎద్దేవా చేశారు. -
'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీ వేశాక కూడా కార్మికులు సమ్మెకు వెళ్లడం బాధనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, యాజమాన్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటికీ మూడు వారాల గడువు కోరామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణమే సమ్మె విరమించి మూడు వారాల పాటు సమయం ఇవ్వలని కోరామని.. కార్మిక సంఘాలు రేపు మాట్లాడుకుని సమాధానం చెప్తామన్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ సమ్మెపై చర్చలు విఫలం: సమ్మె కొనసాగింపు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గం ఉపసంఘం చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రివర్గం ఉపసంఘం ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మరో మూడు వారాల గడువు ఇవ్వాలని ఉపసంఘం కోరడంతో అందుకు కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితిల్లోనూ తాము సమయం ఇవ్వలేమని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో యనుమల రామకృష్ణుడు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, ఎండీ సాంబశివరావులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. 43 శాతం ఫిట్ మెంట్ తో సంస్థపై అదనపు భారం పడుతుందని పాత పంథానే కొనసాగించడం కాస్తా చర్చలు విఫలం కావడానికి దారి తీసింది. దీంతో కార్మిక సంఘాలు తమ సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి సన్నద్ధమైయ్యాయి. గత ఐదు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా.. అవి ఫలించని సంగతి తెలిసిందే. మరోపక్క తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు భీష్మించుకున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా.. అటు విద్యార్థులకు ఎంట్రెన్స్ టెస్ట్ లు ఉండటం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. -
పోరాడకపోతే భావితరాలు క్షమించవు
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై పోరాడకపోతే భావితరాలు క్షమించవని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కన్వీనర్ రత్నాకర్‌రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.వి.కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ఈనెల 26న హైదరాబాదులో జరిగే సమైక్య శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమైక్య రాష్ట్రం తమ పార్టీ విధానమని రాజీనామాలతో పాటు ఏ త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించింది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టే సమైక్య శంఖారావానికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత తరలిరావాలన్నారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండానే న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమ్మె విరమించడం తగన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు నాగన్న, వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, నాగేంద్ర, రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.