
సాక్షి, హైదరాబాద్: టీఎంయూ(తెలంగాణ మజ్దూర్ యూనియన్) గౌరవాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డికి పంపారు.
అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.