'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది' | i am worried abou rtc strike after sub committee, says acham naidu | Sakshi
Sakshi News home page

'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'

Published Sun, May 10 2015 5:46 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది' - Sakshi

'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీ వేశాక కూడా కార్మికులు సమ్మెకు వెళ్లడం బాధనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, యాజమాన్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటికీ మూడు వారాల గడువు కోరామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని అచ్చెన్నాయుడు తెలిపారు.

 

తక్షణమే సమ్మె విరమించి మూడు వారాల పాటు సమయం ఇవ్వలని కోరామని.. కార్మిక సంఘాలు రేపు మాట్లాడుకుని సమాధానం చెప్తామన్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement